ED Sanjay Raut : సంజయ్ రౌత్ పై ఈడీ షాకింగ్ కామెంట్స్
సంజయ్ రౌత్ రూ. 1.06 కోట్లు లబ్ది పొందారు
ED Sanjay Raut : శివసేనకు చెందిన సంజయ్ రౌత్ ను అరెస్ట్ చేసిన పట్రా చాల్ రీడెవలప్ మెంట్ ప్రాజెక్టులో రూ. 1,000 కోట్ల కుంభకోణమని ఈడీ(ED Sanjay Raut) సోమవారం తెలిపింది.
రౌత్ , ఆయన ఫ్యామిలీ రూ. 1.06 కోట్ల వరకు లబ్ది పొందారని పేర్కొంది. గతంలో క్లెయిమ్ చేసిన 83 లక్షల నుండి అలీ బాగ్ ల్యాండ్ డీల్ లో కీలక సాక్షిని అత్యాచారం, హత్యతో బెదిరించినట్లు కూడా ఈడీ ఆరోపించింది.
స్వప్నా పాట్కర్ అనే మహిళ జూలై 22న ఫిర్యాదు చేసిందని తెలిపింది. అత్యాచారం చేస్తామని, వినక పోతే హత్య చేస్తామంటూ బెదిరించారంటూ ఫిర్యాదు చేసిందని పేర్కొంది.
జూలై 15న తమకు అందిందన్నారు. ఇక మనీ లాండరింగ్ ఆరోపణలపై మిస్టర్ రౌత్ ను గత రాత్రి ఈడీ అరెస్ట్ చేసింది. ముంబై లోని కోర్టు నాలుగు రోజుల పాటు ఏజెన్సీ కస్టడీలోకి తీసుకుంది.
ఇదిలా ఉండగా కేంద్రాన్ని ప్రశ్నించినందు వల్లనే తనను టార్గెట్ చేశారని, అక్రమ ఆధారాలతో తనను ఇరికించే ప్రయత్నం చేశారంటూ సంజయ్ రౌత్ ఆరోపించారు.
ఈ సందర్భంగా తనను మీడియాతో మాట్లాడారు. ఇది కక్షితంగా రాజకీయ ప్రతీకారం తప్ప మరొకటి కాదన్నారు. ఒక రకంగా పులిని బోనులో బంధించాలని అనుకోవడం మూర్ఖత్వం అన్నారు.
తనను బయటకు వెళ్లేందుకు కూడా అనుమతించ లేదని ఆరోపించారు సంజయ్ రౌత్(Sanjay Raut) . కాగా ఎంపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది ఈడీ. మూడు సార్లు నోటీసులు ఇచ్చామని కానీ ఆయన ఒక్కసారి మాత్రమే హాజరయ్యాడని తెలిపింది.
Also Read : ఆధారాల మేరకే సంజయ్ రౌత్ అరెస్ట్