Sanju Samson : బీసీసీఐ నిర్వాకం సంజూకు అన్యాయం
వరల్డ్ కప్ జట్టులో కేరళ స్టార్ పై వివక్ష
Sanju Samson : భారత్ లో నిర్వహించే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో ఆడే భారత జట్టులో కేరళ స్టార్ సంజూ శాంసన్ ను ఎంపిక చేయక పోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ముంబై లాబీయింగ్ వల్లే సంజూకు అన్యాయం జరిగిందని పేర్కొంటున్నారు. మరోసారి బీసీసీఐ స్టార్ ఆటగాడి పాలిట కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Sanju Samson Viral
ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టు భారత జట్టు కాదని ఇది ముంబై జట్టు అని ఆరోపిస్తున్నారు. ముంబైకి చెందిన ఆటగాళ్లే ఎక్కువగా ఎంపికయ్యారని , ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయలేదని మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి ఫామ్ లేని సూర్య కుమార్ యాదవ్ ను ఎలా ఎంపి క చేశారంటూ ప్రశ్నిస్తున్నారు.
రన్స్ విషయానికి వస్తే సూర్య కుమార్ యాదవ్ 24 వన్డే ఇన్నింగ్స్ లు ఆడితే 24.33 రన్ రేట్ తో 511 పరుగులు మాత్రమే చేశాడు. ఇక సంజూ శాంసన్(Sanju Samson) 12 ఇన్నింగ్స్ లు ఆడాడు. 55.71 యావరేజ్ రేటింగ్ తో 390 రన్స్ సాధించాడు. కావాలని బీసీసీఐ సంజూ శాంసన్ జీవితంతో ఆడుకుంటోందంటూ ధ్వజమెత్తుతున్నారు. మొత్తంగా నెట్టింట్లో మరోసారి చర్చకు దారి తీశాడు సంజూ శాంసన్.
Also Read : Minister KTR : హైదరాబాద్ లో మలబార్ గ్రూప్ ఇన్వెస్ట్