Sarandeep Singh : విరాట్ కోహ్లీపై మాజీ సెలెక్ట‌ర్ ఫైర్

ఫామ్ కోల్పోతే రెస్ట్ తీసుకుంటారా

Sarandeep Singh : భార‌త స్టార్ క్రికెట‌ర్ , మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ సెలెక్ట‌ర్ శ‌ర‌ణ్ దీప్ సింగ్(Sarandeep Singh). ఇప్ప‌టికే పేల‌వ‌మైన ఆట తీరుతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు కోహ్లీ.

గ‌త నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో ఒక్క సెంచ‌రీ కూడా న‌మోదు చేయ‌లేదు. అడ‌పా ద‌డ‌పా హాఫ్ సెంచ‌రీలు రెండు మూడు త‌ప్పా. ఈ త‌రుణంలో కోహ్లీని రెస్ట్ పేరుతో ఎందుకు ప‌క్క‌న పెట్టారో అర్థం కావ‌డం లేద‌ని పేర్కొన్నాడు.

ఓ వైపు యువ ఆట‌గాళ్లు ఫుల్ జోష్ లో ఉన్నార‌ని ఈ లెక్క‌న కోహ్లీని ఆడించ‌క పోవ‌డ‌మే బెట‌ర్ అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ఓ వైపు ఫామ్ ప‌డి పోతుంటే ఎవ‌రైనా క్రికెట‌ర్లు తిరిగి మైదానంలోకి రావాల‌ని అనుకుంటార‌ని కానీ కోహ్లీ మాత్రం రెస్ట్ తీసుకోవాల‌ని అనుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నాడు.

విశ్రాంతి అన్న‌ది ఒక సాకు మాత్ర‌మేన‌ని ఎద్దేవా చేశాడు. ఇంగ్లాండ్ టూర్ లో నిరాశ ప‌రిచాడు. విండీస్ లో ప‌ర్య‌టించే టి20 భార‌త జ‌ట్టులో స్థానం కోల్పోయాడు.

రెస్ట్ పేరుతో ఎంపిక చేయలేద‌ని బీసీసీఐ ప్ర‌క‌టించినా కార‌ణం మాత్రం త‌ను ఫామ్ లేక పోవ‌డ‌మేన‌ని మాజీ క్రికెట‌ర్లు పేర్కొంటున్నారు. అంతే కాదు వ‌న్డే సీరీస్ లో కూడా కోహ్లీని ప‌క్క‌న ఎట్టింది.

ఈ త‌రుణంలో ఫామ్ రావాలంటే త‌ప్ప‌నిస‌రిగా ఆడాల్సి ఉంటుంద‌ని కానీ రెస్ట్ పేరుతో వెన‌క్కి త‌గ్గ‌డం ఏమిటంటూ నిల‌దీశాడు శ‌ర‌ణ్ దీప్ సింగ్(Sarandeep Singh). విశ్రాంతి అంటే ఏమిటో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నాడు.

సెంచ‌రీలు చేస్తేనే రెస్ట్ తీసుకునే చాన్స్ ఉంటుంది. గ‌త మూడు నెల‌లుగా కోహ్లీ చేసిన ప‌రుగులు రెండంకెలు దాట లేద‌న్నాడు.

Also Read : చోటు కోసం ర‌న్ మెషీన్ తండ్లాట‌

Leave A Reply

Your Email Id will not be published!