Satya Pal Malik : మోదీ..మిత్రులపై విచారణ చేపట్టాలి
మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్
Satya Pal Malik : కేంద్రంలో కొలువు తీరిన మోదీ, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ పై నిప్పులు చెరిగారు జమ్మూ కాశ్మీర్ , మేఘాలయ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్. ఆయన గత కొంత కాలం నుంచీ తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గనుక మోదీని, ఆయన పరివారాన్ని ఓడించక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సత్య పాల్ మాలిక్ హెచ్చరించారు.
తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ఈ దేశానికి ఓ శాపంగా మారాడని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు కేంద్రం ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ గురించి ఆందోళన చెందుతున్నాయని దీనిని తగ్గించుకుంటే బెటర్ అని సూచించారు. ముందు దర్యాప్తు సంస్థల కంటే ఆక్టోపస్ లా విస్తరించిన బీజేపీని నామ రూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.
కానీ విపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావాలని సూచించారు. సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ప్రజలు స్వచ్చంధంగా తరలి రావాలని సత్య పాల్ మాలిక్(Satya Pal Malik) పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం మనుగడ సాధించ లేదంటూ జోష్యం చెప్పారు. ఆపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై, ఆయన అనుచరులు, సహచరులపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం మాజీ గవర్నర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : PM Modi : ఆనందాన్నిచ్చిన అమెరికా పర్యటన