PM Modi Chant : అమెరికాలో మోదీ నామ స్మ‌ర‌ణ‌

ప్ర‌వాస భార‌తీయుల జేజేలు

PM Modi Chant : అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ , ప్ర‌థ‌మ పౌరురాలు జిల్ బైడెన్ ఆహ్వానం మేర‌కు భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి నరేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసింది. మోదీ యుఎస్ ను వీడారు. అక్క‌డి నుండి నేరుగా ఈజిప్టును సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా మోదీకి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌వాస భార‌తీయులు చుట్టుముట్టారు. ఆయ‌న‌తో ఫోటోలు దిగేందుకు, సంత‌కాలు తీసుకునేందుకు పోటీ ప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి సైతం శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్ర‌వాస భార‌తీయులు త‌న ప‌ట్ల కురిపించిన ఆద‌ర‌ణ‌, ప్రేమాభిమానాలు ఎల్ల‌ప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇరు దేశాల మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డానికి మీరే కార‌ణ‌మ‌ని ప్ర‌ధాని కొనియాడారు. యుఎస్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌తి క్ష‌ణం త‌న‌కు అత్యంత ఆనందాన్ని ఇచ్చింద‌ని పేర్కొన్నారు న‌రేంద్ర మోదీ(PM Modi).

విదేశీ క‌మ్యూనిటీకి సంబంధించిన బ‌లం , వైవిధ్యం, స‌హ‌కారానికి హృద‌య పూర్వ‌క‌మైన ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ. ఇదిలా ఉండ‌గా అమెరికా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఎక్క‌డ చూసినా మోదీ మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్ర‌తి చోటా ఆయ‌న‌కు గ్రాండ్ వెల్ క‌మ్ ల‌భించింది. ప్ర‌స్తుతం అమెరికాలోని ప్ర‌వాస భార‌తీయులకు సంబంధించిన ఫోటోలు స్వ‌యంగా న‌రేంద్ర మోదీ పంచుకున్నారు. ఇప్పుడు వైర‌ల్ గా మారాయి.

Also Read : Satya Pal Malik : మోదీ..మిత్రుల‌పై విచార‌ణ చేప‌ట్టాలి

Leave A Reply

Your Email Id will not be published!