Satya Pal Malik : నా ప్రశ్నలకు బదులేది – సత్య పాల్
కేంద్రంపై నిప్పులు చెరిగిన మాజీ గవర్నర్
Satya Pal Malik : జమ్మూ కాశ్మీర్, మేఘాలయ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తాను లేవదీసిన ప్రశ్నలకు ఏ ఒక్క దానికి ఇప్పటి వరకు కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా సత్య పాల్ మాలిక్ గత కొంత కాలం నుంచీ మోదీని, బీజేపీని, దాని అనుబంధ సంస్థలను తూర్పార బడుతున్నారు.
తాను ఏనాడూ ఒక్క పైసా తీసుకోలేదని, పైగా తనకు లంచం ఇచ్చేందుకు వచ్చిన వారిని వెనక్కి పంపించిన చరిత్ర తనదన్నారు. కానీ ఏ న్యాయం కోసం, ధర్మం కోసం నిలబడ్డానో తనను ఇబ్బందులకు గురి చేసేందుకు మోదీ సర్కార్ యత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా చివరి ప్రాణం ఉన్నంత వరకు తాను నిజాయితీని వీడనని , సత్యం కోసం నిలిచే ఉంటానని స్పష్టం చేశారు సత్య పాల్ మాలిక్(Satya Pal Malik).
రాబోయే ఎన్నికలు దేశానికి , 143 కోట్ల మంది భారతీయులకు అత్యంత ముఖ్యమైనవని హెచ్చరించారు. ఈసారి గనుక మోదీ ని, బీజేపీని ఓడించక పోతే దేశం సర్వ నాశనమై పోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు సత్య పాల్ మాలిక్. పుల్వామాపై జరిగిన దాడిని , రైతులు చేపట్టిన ఆందోళనకు తాను బేషరతుగా మద్దతు తెలిపానని చెప్పారు. కానీ తనను ప్రభుత్వ వ్యతిరేకిగా ముద్ర వేసిందన్నారు. ప్రజల కోసం తాను పని చేశానని పదవుల కోసం కాదన్నారు.
Also Read : Tulja Bhavani Reddy : ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన కూతురు
