Satyavathi Rathod : లాకప్ డెత్ పై విచారణ చేపట్టాలి
డీజీపీని కోరిన మాజీ మంత్రి రాథోడ్
Satyavathi Rathod : హైదరాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చిన వెంటనే లాకప్ డెత్ చోటు చేసుకోవడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన నేనావత్ సూర్యా నాయక్ లాకప్ డెత్ కు గురయ్యాడు. దీనిపై పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. పోలీసులు మారక పోవడం దారుణమని ఆరోపించారు.
Satyavathi Rathod Comment about Lockup Death
ఈ సందర్భంగా ఎందుకు సర్కార్ స్పందించడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod). నేనావత్ సూర్య నాయక్ లాకప్ డెత్ పై సీనియర్ అధికారితో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు . రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలుసుకున్నారు.
సత్యవతి రాథోడ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ , బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆచారి ఉన్నారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టాలని కోరుతూ లేఖను డీజీపీని కలిసి అందజేశారు. వెంటనే విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకు స్పందించక పోవడం దారుణమన్నారు మాజీ మంత్రి . లాకప్ డెత్ కు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చని పోయిన బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read : President Murmu : దేశాభివృద్దిలో కీలకం కావాలి