SBI Shock : ఖాతాదారులకు ఎస్బీఐ ఝలక్
వడ్డీ రేట్లను పెంచిన కేంద్ర బ్యాంకు
SBI Shock : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంచడంతో ఆ ప్రభావం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులపై పడింది. రాను రాను అన్ని బ్యాంకులు ప్రైవేట్ జపం చేసే స్థాయికి దిగజారేలా చేసింది కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం.
ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెట్టింది. దాదాపు 100కి పైగా సంస్థలను కార్పొరేట్ లకు దారదాదత్తం చేసింది.
ఈ తరుణంలో దేశ ఆర్థిక రంగం సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ధరా భారం జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా 75 ఏళ్ల కాలంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటు పెరిగింది.
దానిని నియంత్రించే మెకానిజం లేకుండా పోయింది. ఇదే విషయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇలాగే ఉంటే దేశంలో శ్రీలంక సంక్షోభం కొనసాగే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు.
ఈ తరుణంలో దేశంలో కేంద్ర బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI Shock) కోలుకోలేని షాక్ ఇచ్చింది ఖాతాదారులకు. తీసుకున్న రుణాలపై 50 బేసిస్ పాయింట్లు పెంచింది.
దీంతో రుణ గ్రహీతలకు కోలుకోలేని భారం పడనుంది. నెల వారీగా చెల్లించే కిస్తులు లేదా వాయిదాలు మరింత తడిసి మోపెడు కానున్నాయి.
దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వజ్రోత్సవాలు నిర్వహిస్తోంది.
ఈ సంతోషవేళ జాతీయ జెండాలను కూడా ఎగుర వేశారు. కానీ ఎస్బీఐ మాత్రం ఎక్కడా తగ్గలేదు. రోజు రోజుకు ఖాతాదారులకు శఠగోపం పెట్టే పనిలో పడింది సదరు బ్యాంకు.
Also Read : అజాతశత్రువుకు అశ్రు నివాళి