BPCL : ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు – బీపీసీఎల్
దక్షిణ భారతదేశంలో రెండో దశ ప్రారంభం
BPCL : భారత దేశంలో పేరొందిన మహారత్న కంపెనీలలో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) కీలక ప్రకటన చేసింది. దక్షిణ భారత దేశంలోని రెండు కారిడార్లలో 25 కేవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. 9 ఇంధన స్టేషన్లలో సీసీఎస్ -2 ఫాస్ట్ ఛార్జర్లను అమర్చనున్నట్లు తెలిపింది.
మొదటి దశలో భాగంగా చెన్నై తిరుచ్చి మధురై హైవేపై ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు బీపీసీఎల్(BPCL) ఆధ్వర్యంలోని 7,000 సంప్రదాయ రిటైల్ అవుట్ లెట్ లను బహుళ ఇంధన ఎంపికలను అందించే ఎనర్జీ స్టేషన్లుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
అంతే కాకుండా బెంగళూరు చెన్నై , బెంగళూరు మైసూర్ కూర్గ్ లలో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇవాళ బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఈ విషయం స్పష్టం చేసింది కంపెనీ. దేశంలోని ప్రధాన నగరాలు, ఆర్థిక కేంద్రాలను కలుపుతూ అన్ని ప్రధాన జాతీయ రహదారలపై ఏర్పాటు చేయనుంది.
25కేడబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ ని ఇన్ స్టాల్ చేయడం వల్ల వినియోగదారులు బీపీసీఎల్ కు(BPCL) చెందిన ఫ్రెండ్లీ పేమెంట్ మొబైల్ అప్లికేషన్ సౌలభ్యంతో 125 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చని తెలిపింది బీపీసీఎల్. దాదాపు 30 నిమిషాల్లోపే ఈవీ స్టేషన్లు ఎక్కడున్నాయో గుర్తించేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది.
ఫాస్ట్ ఛార్జర్ ను ఎటువంటి సహాయం లేకుండా స్వయంగా ఆపరేట్ చేసుకునే వీలు ఉంది. సహాయక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని తెలిపింది కంపెనీ . దీంతో మరింత మార్కెట్ విస్తరించే యోచనలో ఉంది బీపీసీఎల్.
Also Read : టెలికాం రంగంలో 5జీ పెను సంచలనం