Shah Rukh Khan Messi : అత్యుత్తమ ప్రతిభకు దక్కిన గౌరవం
లియోనెల్ మెస్సీకి నటుడి కితాబు
Shah Rukh Khan Messi : లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022ను ఫ్రాన్స్ ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు , సినీ రంగానికి చెందిన వారు మెస్సీని, అర్జెంటీనా సాధించిన విజయాన్ని ప్రశంసిస్తున్నారు.
ట్విట్టర్ వేదికగా అభినందనల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) మెస్సీని ఆకాశానికి ఎత్తేశాడు. ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. టాలెంట్ (ప్రతిభ), హార్డ్ వర్క్ ( కష్టపడే తత్వం), డ్రీమ్స్ (కలలు కనడం ) తో మెస్సీ తనదైన ముద్ర కనబర్చాడని తనను ఎంతగానో ఆకట్టుకున్నాడని పేర్కొన్నారు షారుఖ్ ఖాన్.
మెస్సీకి ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపాడు. మెస్సీని చూస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నాడు. ఈ అద్భుతమైన కాలంలో జీవిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నాడు షారుఖ్ ఖాన్. తాను చూసిన అత్యుత్తమ ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఇది ఒకటి అని కితాబు ఇచ్చాడు.
ఆనాడు మా అమ్మతో కలిసి వరల్డ్ కప్ చూడటం ఇప్పటికీ గుర్తుకు ఉందన్నాడు. ఇవాళ 2022 వరల్డ్ కప్ ను నా పిల్లలతో కలిసి చూడటం మరింత సంతోషాన్ని కలిగించిందని(Shah Rukh Khan) స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ ట్వీట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా మెస్సీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు.
Also Read : బిగ్ బాస్ సీజన్ – 6 విన్నర్ రేవంత్