Shahid Afridi : బీసీసీఐ మాటే వేదం ఐసీసీ శిరోధార్యం

పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ అఫ్రిదీ కామెంట్స్

Shahid Afridi : ప్ర‌పంచ క్రికెట్ ను ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శాసిస్తుంద‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. ఎందుకంటే ఇప్పుడు వ‌ర‌ల్డ్ క్రికెట్ భ‌విష్య‌త్తు మొత్తం భార‌త క్రికెట్ చేతిలో ఉంద‌న్నాడు పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిది(Shahid Afridi).

ప్రంప‌చ క్రికెట్ రూపు రేఖ‌ల‌న్నింటిని బీసీసీఐ మార్చేసింద‌ని పేర్కొన్నాడు. ఒక్క ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) డిజిట‌ల్ , మీడియా రైట్స్ ద్వారానే ఐదేళ్ల కాలానికి రూ. 48, 390 కోట్లు రాబ‌ట్ట‌డం మామూలు విష‌యం కాద‌న్నాడు.

ఇప్పుడు ప్ర‌పంచంలోని క్రికెట్ లీగ‌ల్ ల‌లో ఐపీఎల్ రెండో స్థానంలో నిలిచింది. అంటే దాని వాల్యూ మ‌రింత పెరిగింది. భార‌త్ తో పోల్చుకుంటే పాకిస్తాన్ లో అంత సీన్ లేదు.

ఇక్క‌డ నెల‌కొన్న రాజ‌కీయ అనిశ్చత ప‌రిస్థితి కూడా ఓ కార‌ణ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు అఫ్రిదీ. ఇదే స‌మ‌యంలో ఐపీఎల్ కార‌ణంగా షెడ్యూల్స్ మారుతున్నాయి.

అద్భుత‌మైన క్రికెట‌ర్లు టెస్టులు, వ‌న్డేల‌కు దూర‌మ‌వుతున్నారని పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూ వ‌స్తోంది.

కానీ అదే దేశానికి చెందిన ఆట‌గాళ్లు ఐపీఎల్ లో స‌త్తా చాటుతున్నారు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం లేదు. మొత్తంగా బీసీసీఐ పుణ్య‌మా అని క్రికెట‌ర్ల‌కు కాసుల పంట పండుతోంది.

నిన్న‌టి దాకా ఆర్థిక‌, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీ‌లంక కు చెందిన ఆట‌గాళ్లు సైతం ఐపీఎల్ లో ఆడారు. క‌నీసం కొంత కాలం బ‌తికేందుకు కావాల్సిన డ‌బ్బుల్ని పొంద గ‌లిగారు.

ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా చూసుకుంటే బీసీసీఐలో ఉన్న‌న్ని డ‌బ్బులు, ఆదాయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో లేదు. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేసిన దాఖ‌లాలు లేవు.

Also Read : ప్రాక్టీస్ లో భార‌త ఆటగాళ్లు నిమగ్నం

Leave A Reply

Your Email Id will not be published!