Shashi Tharoor Laxman : ‘బీసీసీఐ..లక్ష్మణ్’ పై శశి థరూర్ ఫైర్
ఏ ప్రాతిపదికన పంత్ ను ఎంపిక చేశారు
Shashi Tharoor Laxman : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ లోని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నిప్పులు చెరిగారు. బుధవారం ట్విట్టర్ వేదికగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని, న్యూజిలాండ్ టూర్ లో తాత్కాలిక కోచ్ గా ఎంపికైన వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు వన్డేల సీరీస్ లో భాగంగా మొదటి వన్డేలో రాణించినా ఎందుకు కేరళ స్టార్ సంజూ శాంసన్ ను పక్కన పెట్టారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం శశి థరూర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఇదిలా ఉండగా మ్యాచ్ లో భాగంగా నెంబర్ 4 లో రిషబ్ పంత్ బాగా రాణిస్తున్నాడని అందుకే అతడిని ఎంపిక చేశామని చెప్పిన లక్ష్మణ్ కు బుద్ది ఉందా అంటూ ఫైర్ అయ్యారు. ఎలా అతడికి మద్దతు ఇస్తారంటూ ప్రశ్నించాడు. ఓ మాజీ క్రికెటర్ గా, కోచ్ గా ఆటగాళ్ల గురించి ఏమైనా తెలుసా అని నిలదీశారు శశి థరూర్(Shashi Tharoor).
గత 11 ఇన్నింగ్స్ లలో రిషబ్ పంత్ పూర్తిగా ఫామ్ లో లేడన్నాడు. మూడో వన్డేలో పట్టుమని 10 పరుగులు కూడా చేయలేదన్నాడు. కానీ 66 సగటు అత్యుత్తమ రేట్ తో కలిగి ఉన్న, అద్భుతంగా రాణిస్తున్న సంజూ శాంసన్ ను ఎందుకు పక్కన పెట్టారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నీచ రాజకీయాలకు పాల్పడుతూ ప్రతిభ ఆటగాళ్లను తొక్కి పెడతారా అంటూ భగ్గుమన్నారు ఎంపీ శశి థరూర్. గత 11 మ్యాచ్ లలో రిషబ్ పంత్ 10 సార్లు విఫలమయ్యాడని ఏ రకంగా అతడిని ఎంపిక చేశారో దేశానికి జవాబు చెప్పాలంటూ లక్ష్మణ్ ను నిలదీశాడు.
Also Read : ‘పది’కే ‘పంత్’ పరిమితం సర్వత్రా ఆగ్రహం
"Pant has done well at No. 4, so it is important to back him," says @VVSLaxman281. He's a good player out of form who's failed in ten of his last 11 innings; Samson averages 66 in ODIs, has made runs in all his last five matches & is on the bench. Go figure. @IamSanjuSamson
— Shashi Tharoor (@ShashiTharoor) November 30, 2022