Shashi Tharoor : పీటీ ఉష కామెంట్స్ శశి సీరియస్
రెజ్లర్ల నిరసనపై ఎంపీ ఆవేదన
Shashi Tharoor : తమకు న్యాయం చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు చేస్తున్న నిరసనపై నోరు జారారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ పీటీ ఉష. ఆమె చేసిన కామెంట్స్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) . రెజ్లర్లు చేస్తున్న ఆందోళనను ప్రతికూల విధానంగా పేర్కొనడాన్ని తప్పు పట్టారు. మల్లయోధులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని, దేశ ప్రతిష్టను ఎలా దిగజార్చారో చెప్పాలన్నారు.
రెజ్లింగ్ బాడీ హెడ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రెజ్లర్లు నిరసనకు దిగారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపడుతున్నారు. రెజ్లర్ల నిరసన క్రమశిక్షణా రాహిత్యానికి సమానం అని ఉష పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఆరోపణలను పరిశీలిస్తున్న కమిటీ నివేదిక కోసం వేచి ఉండక పోవడాన్ని ఖండించారు.
ఒక మహిళా, ఐఓఏ చీఫ్ గా, మాజీ అథ్లెట్ గా ఉన్న పీటీ ఉష ఇలా కామెంట్స్ చేస్తుందని తాను అనుకోలేదన్నారు శశి థరూర్(Shashi Tharoor) . ఓ వైపు వాళ్లంతా బాధితులు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్లు. దేశం కోసం ఆడుతున్నారు. అంతే కాదు గతంలో ఎన్నో విజయాలు సాధించి పెట్టారు. ఎన్నో పతకాలు తీసుకు వచ్చారు. జాతీయ పతాకం రెప రెప లాడేలా చేశారు. అలాంటి వారు రోడ్డెక్కితే ఇలాగేనా వ్యవహరించేది అంటూ మండిపడ్డారు ఎంపీ.
Also Read : రెజ్లర్ల ఆందోళనపై సుప్రీం విచారణ