Shazia Ilmi : పరివార్ లో షాజియా కామెంట్స్ పరేషాన్
బిల్కిస్ బానో దోషుల విడుదలపై ఆగ్రహం
Shazia Ilmi : భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకురాలు షాజియా ఇల్మీ బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడం, ఆపై సత్కరించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టింది. బీజేపీ అనుబంధ సంస్థ విశ్వ హిందూ పరిషత్ కు చెందిన వారు సత్కరించడాన్ని తప్పు పట్టింది. ఇందుకు సంబందించి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
దీంతో ఇప్పుడు షాజియా ఇల్మీ చేసిన ఈ కామెంట్స్ కాషాయ పరివార్ ( బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ, భజరంగ్ దళ్ ) లో కలకలం రేపాయి.
ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాకుండా దారుణ హత్యకు పాల్పడిన ఘటన దేశాన్ని, సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేసిందన్నారు.
ఈ ఘటనలో ఇప్పటికే కోర్టు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే గుజరాత్ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం వారిలో ప్రవర్తన బాగుందంటూ విడుదల చేసింది.
అదీ దేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15న . దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. దోషులకు ఎలా మద్దతు ఇస్తారంటూ ప్రశ్నల వర్షం కురిసింది.
ఇదే సమయంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తమిళనాడు బీజేపీ నాయకురాలు , నటి కుష్బూ సుందర్ సైతం తీవ్ర అభ్యంతరం తెలిపారు.
స్త్రీ జాతికి ఇది తీరని అవమానమని పేర్కొన్నారు. కాగా షాజియా ఇల్మీ చేసిన దారుణ వ్యాఖ్యలపై (Shazia Ilmi) విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రతికూల వ్యాఖ్యలు చేసే హక్కు లేదంటూ పేర్కొంది. ఓ జాతీయ దినపత్రిక ( ఇండియన్ ఎక్స్ ప్రెస్ )లో షాజియా ఇల్మీ ఓ వ్యాసం రాసింది. అందులో బిల్కిస్ బానో దోషులను వీహెచ్ పీ ఆధ్వర్యంలో సత్కరించడం దారుణమంటూ ఆరోపించింది.
Also Read : యూఎస్ ఓపెన్ విజేతగా కార్లోస్