Vani Jayaram : గాయ‌ని వాణీ జ‌య‌రాం ఇక లేరు

మూగ బోయిన కోయిల

Vani Jayaram : ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌ని వాణీ జ‌య‌రాం ఇక లేరు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆమె ఇవాళ త‌మిళ‌నాడులోని చెన్నై లో త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇంట్లో జారి ప‌డ‌డంతో నుదురుకు గాయమైంది. ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గానే ప్రాణాలు కోల్పోయింది. ఇదిలా ఉండ‌గా వాణీ జ‌య‌రాం అద్భుత‌మైన గాయ‌నిగా పేరు తెచ్చుకుంది.

ఆమె అస‌లు పేరు క‌లైవాణి. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ‌, హిందీ, గుజ‌రాతీ, మ‌రాఠీ, ఒరియా , బోజ్ పురి త‌దిత‌ర 19 భాష‌ల్లో ఏకంగా 20 వేల‌కు పైగా పాట‌లు పాడారు. క‌ర్ణాట‌క సంగీతంలో ప‌ట్టు క‌లిగి ఉన్నారు. దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా అద్భుత‌మైన గాయ‌నిగా పేరు తెచ్చుకున్నారు వాణీ జ‌య‌రాం.

ఉత్త‌మ గాయ‌కురాలిగా ఎన్నో అవార్డులు ,పుర‌స్కారాలు అందుకున్నారు. మూడుసార్లు జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, గుజ‌రాత్, ఒడిశా , ఏపీ , త‌దిత‌ర రాష్ట్రాలు వాణీ జ‌య‌రాంను (Vani Jayaram) ఘ‌నంగా స‌త్క‌రించాయి. ఇటీవ‌లే ఆమెకు కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ భూష‌ణ్ అత్యున్న‌త పుర‌స్కారం అంద‌జేసింది.

త‌మిళ‌నాడులోని వెల్లూరులో పుట్టారు. ఆమెకు 78 ఏళ్లు. విచిత్రం ఏమిటంటే సినీ రంగం నుంచి ఇద్ద‌రు దిగ్గ‌జాలు వెళ్లి పోయారు. ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ ఇవాళ వాణీ జ‌య‌రాం. కె. బాల చంద‌ర్ తీసిన అపూర్వ రాగంగ‌ళ్ సినిమాకు అవార్డు ద‌క్కింది. ఇది తెలుగులో అంతులేని క‌థ‌గా వ‌చ్చింది. కె. విశ్వ‌నాథ్ సినిమాల‌కు జాతీయ స్థాయిలో రెండు సార్లు పుర‌స్కారం అందుకుంది వాణీ జ‌య‌రాం.

ఆమె పాడిన తెలుగు సినిమాల‌లో మ‌రో చ‌రిత్ర‌, శంక‌రా భ‌ర‌ణం , సీతాకోక చిలుక‌, శ్రుతిల‌య‌లు, స్వ‌ర్ణ‌క‌మ‌లం, స్వాతి కిర‌ణం ,ప్రేమాల‌యం త‌దిత‌ర చిత్రాలకు పాడారు. త‌న గాత్రంతో అల‌రించారు.

Also Read : కళాత‌ప‌స్వికి క‌న్నీటి నివాళి

Leave A Reply

Your Email Id will not be published!