Sirisha Bandla : గుంటూరు నుండి అంత‌రిక్షం దాకా

ఓ మ‌హిళ వ్యోమ‌గామి క‌థ

Sirisha Bandla : ఎవ‌రీ బండ్ల శిరీష అని అనుకుంటున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వ్యోమగామి. ఆమెకు చిన్న‌ప్ప‌టి నుంచే అంత‌రిక్షం అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం .

మిణుకు మిణుకు మ‌నే న‌క్షత్రాలు, వాటి వెనుక వ‌చ్చీ పోయే చంద‌మామ గురించి తెలుసు కోవాల‌ని ఆతృత‌. ఏదో ఒక రోజు ఆకాశానికి ఆవ‌ల వెళ్లి రావాల‌ని కోరిక‌. ఎన్నో ఇబ్బందులు. వాటిన్నింటిని ఆమె ఎదుర్కొంది.

బండ్ల శిరీష‌(Sirisha Bandla) కు ఇప్పుడు 34 ఏళ్లు. యుఎస్ లో పెరిగింది. కంటి చూపు స‌రిగా లేక పోవ‌డంతో నాసా వ్యోమ‌గామి కాలేక పోయింది. ఇంజ‌నీరింగ్ బాట ప‌ట్టింది. స‌ర్ రిచ‌ర్డ్ బ్రాన్స‌న్ తో క‌లిసి వెళ్లిన టీంలో ఆమె కూడా ఒక‌రు.

కానీ భూమికి దాదాపు 90 కి.మీ. ఎత్తుకు ప్ర‌యాణించ‌డంతో శిరీష‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. ఒక ర‌కంగా అదృష్ట‌మ‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. అంత‌రిక్షంలోకి వెళ్లి రావ‌డం అనేది మ‌రిచి పోలేని అనుభూతి అంటూ పేర్కొంది.

ఎప్పుడో క‌వులు రాస్తే విని ఆనందించిన నేను ఇవాళ వెళ్లి వ‌స్తాన‌ని అనుకోలేద‌ని ఆనందంతో చెప్పింది. ఇదిలా ఉండ‌గా భార‌త దేశం నుంచి

క‌ల్ప‌నా చావ్లా , సునీతా విలియ‌మ్స్ త‌ర్వాత వ్యోమ‌గామి అయిన మూడో భార‌తీయ సంత‌తికి చెందిన మ‌హిళ బండ్ల శిరీష‌(Sirisha Bandla) .

చిన్న‌ప్ప‌టి నుంచే ఈ కోరిక ఉండేద‌ని చెప్పింది. క‌ల్ప‌నా చావ్లాను చూసి , ఆమె అసాధార‌ణ ప్ర‌తిభ‌, ప‌ట్టుద‌ల‌ను చూసి ఆశ్చ‌ర్య పోయాను.

నా కెరీర్ పై కూడా చావ్లా ప్ర‌భావం ఉంద‌ని తెలిపింది బండ్ల శిరీష‌.

ఇదిలా ఉండ‌గా శిరీష వ‌ర్డిన్ గెలాక్టిక్ లో ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాలు, రీసెర్చ్ ఆప్స్ కు వైస్ ప్రెసిడెంట్ గా ప‌ని చేస్తున్నారు. భార‌త దేశంలోని స్పేస్

స్టార్ అప్ ఎకో సిస్ట‌మ్ డెవ‌ల‌ప్ మెంట్ పై ఓ స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు ఇక్క‌డికి వ‌చ్చారు.

Also Read : గుడిని శుభ్రం చేసిన ద్రౌప‌ది ముర్ము

Leave A Reply

Your Email Id will not be published!