Granite Quarry: బల్లికురవ గ్రానైట్‌ క్వారీలో ప్రమాదం ! ఆరుగురు మృతి !

బల్లికురవ గ్రానైట్‌ క్వారీలో ప్రమాదం ! ఆరుగురు మృతి !

Granite Quarry : బాపట్ల జిల్లాలోని బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్‌ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ అంచు విరిగిపడి ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతులను ఒడిశా వాసులుగా గుర్తించారు. ప్రమాద సమయంలో క్వారీలో 16మంది పనిచేస్తున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు క్వారీలో సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీల్లో ప్రమాదాలు జరగటం సర్వసాధారణం అయిపోయింది. క్వారీల్లో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్వారీ ప్రమాదాలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Granite Quarry – ఈ ఘటనపై విచారణ జరపాలి – సీఎం చంద్రబాబు

బాపట్ల జిల్లా బల్లికురవ క్వారీ ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంతో పాటు మరి కొంత మంది కార్మికులు తీవ్రంగా గాయపడటం దురదృష్టకరమన్నారు. ఈ ప్రమాదంపై అధికారులతో సీఎం మాట్లాడారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ఘటనపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Granite Quarry – ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది – మంత్రి నారా లోకేష్

బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో (Granite Quarry) బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలవడం తనను తీవ్రంగా కలచివేసిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రమాదంలో రోజువారీ కూలీలు మృతిచెందడం బాధాకరమని అన్నారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యసాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి – మంత్రి కొలుసు పార్థసారథి

బల్లికురవ క్వారీ (Granite Quarry) ప్రమాదంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ ద్వారా మాట్లాడారు. రెస్క్యూ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలను ఏపీ ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలంటూ కలెక్టర్‌కు సూచించామని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు.

క్వారీ ప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

బాపట్ల క్వారీ ప్రమాదంపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ తరహా ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

క్వారీ ప్రమాదంపై పలువురు మంత్రుల దిగ్భ్రాంతి

బాపట్ల జిల్లాలో గ్రానైట్ క్వారీ (Granite Quarry) ప్రమాదంపై మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో రాయిపడి ఆరుగురు కార్మికులు మృతి చెందడంపై మంత్రులు సత్యప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రులు సానుభూతి తెలిపారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.

బల్లికురవ సమీపంలో సత్యక్రిష్ణ గ్రానైట్‌ క్వారీలో ఆదివారం ఉదయం బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన మరో 10 మంది కార్మికులను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. క్వారీ యాజమాన్యం భద్రతా చర్యలు చేపట్టలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు. ప్రమాద ఘటనపై బాపట్ల జిల్లా కలెక్టర్‌, ఎస్పీ స్థానిక అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేశారు. మృతులను ఒడిశా వాసులుగా గుర్తించారు.

Also Read : TTD Chairman BR Naidu: ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా – టీటీడీ ఛైర్మన్‌

Leave A Reply

Your Email Id will not be published!