SL vs AUS 2nd Test : లంకేయుల దెబ్బ కంగారూలు అబ్బా
ఆసిస్ పై ఘన విజయం సీరీస్ సమం
SL vs AUS 2nd Test : ఓ వైపు శ్రీలంక దేశం అట్టుడుకుతోంది. ఆర్థిక, ఆహార సంక్షోభంతో తల్లడిల్లుతోంది. రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. జనం రోడ్ల మీదకు వచ్చారు. దేశాధ్యక్షుడి రాజ భవనంలోనే తిష్ట వేశారు. ఆపై పీఎం ఇంటికి నిప్పంటించారు.
వాహనాలను తగుల బెట్టారు. ఈ తరుణంలో తీవ్ర అసహనంతో ఉన్న ఆ దేశానికి క్రికెట్ రూపంలో ఆనందం నింపే ప్రయత్నం చేస్తున్నారు శ్రీలంక ఆటగాళ్లు. పటిష్టమైన జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించారు.
కంగారూలకు కంగారెత్తించారు. గాలే వేదికగా జరిగిన రెండో టెస్టులో గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. 2 మ్యాచ్ ల సీరీస్ ను 1-1 తో సమం చేశారు. మొదటి టెస్టు లో ఆసిస్ గెలిస్తే రెండో టెస్టులో శ్రీలంక(SL vs AUS 2nd Test) అద్భుత విజయాన్ని సాధించింది.
శ్రీలంక బ్యాటర్ దినేష్ చండీమాల్ సూపర్ ఇన్నింగ్స్ తో రాణించాడు. ఒక రకంగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారీ స్కోరు సాధించడంలో మిగతా ఆటగాళ్లు కూడా తోడ్పడ్డారు.
ఏకంగా 206 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక ఆరంభంలోనే ఎంట్రీ ఇచ్చిన స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య కళ్లు చెదిరే బంతులతో తిప్పేశాడు. ఆసిస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు.
మొదటి ఇన్నింగ్స్ లో 118 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు. కేవలం 59 పరుగులు మాత్రమే ఇచ్చిన జయసూర్య మరో 6 వికెట్లు తీసి సత్తా చాటాడు.
ఈ టెస్టులో ఒక్కడే రెండు ఇన్నింగ్స్ లు కలిపి 12 వికెట్లు పడగొట్టాడు. అతడికి తోడు మహీశ తీక్షణ కూడా తోడు కావడంతో శ్రీలంక ఇన్నింగ్స్ 39 పరుగుల తేడాతో ఆసిస్ కు షాక్ ఇచ్చింది.
Also Read : రవి శాస్త్రి..ఎంఎస్ ధోనీ హల్ చల్