SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టెన్నెల్‌ లోకి క్యాడవర్‌ డాగ్స్‌ బృందం

ఎస్‌ఎల్‌బీసీ టెన్నెల్‌ లోకి క్యాడవర్‌ డాగ్స్‌ బృందం

SLBC Tunnel : ఎనిమిది మంది కార్మికుల జాడ కోసం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌(SLBC Tunnel) వద్ద చేపట్టిన సహాయక చర్యలు 14వ రోజుకు చేరుకున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా కార్మికుల ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, ర్యాట్‌ హోల్‌ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ సిబ్బంది జల్లెడ పడుతున్నారు. తాజాగా మరణించిన కార్మికులను గుర్తించేందుకు కేరళకు చెందిన క్యాడవర్‌ డాగ్స్‌ బృందం టన్నెల్‌ లోకి వెళ్లింది. ఇదే సమయంలో టన్నెల్‌ లో తవ్వేందుకు అవసరమైన సామగ్రిని లోకోమోటర్‌ తీసుకెళ్లింది.

SLBC Tunnel Operations

శుక్రవారం ఉదయమే రెండు క్యాడవర్‌ డాగ్స్‌ తో సహాయక బృందం టన్నెల్‌ లోకి వెళ్లింది. బెల్జియం మ్యాల్నోయిస్ బ్రీడ్‌ కు చెందిన క్యాడవర్‌ డాగ్స్‌ 15 ఫీట్ల లోపల ఉన్న వస్తువులను, మృతదేహాలను గుర్తిస్తాయి. ఇదే వీటి ప్రత్యేకత. వీరితో పాటుగా 110 మంది కూడా టెన్నెల్‌ లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మృతదేహాల గుర్తించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎనిమిది మంది కార్మికుల అన్వేషణ అనంతరం ఈ బృందం టన్నెల్‌ నుంచి బయటకు రానుంది.

ఇదిలా ఉండగా… టన్నెల్‌లో కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్‌ సహాయంతో సిగ్నళ్లు పంపగా… 8 ప్రదేశాల నుంచి బలమైన సిగ్నల్స్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలను, లోతును లెక్కకడుతున్నారు. ఎనిమిది ప్రాంతాల్లో మార్కింగ్‌ చేసి రెండుచోట్ల తవ్వకాలు జరిపితే యంత్ర పరికరాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతాలను వదిలేసి మిగతా ఆరు చోట్ల తవ్వకాలు చేపట్టారు.

మరోవైపు.. టన్నెల్‌లోని వ్యర్దాలను కన్వేయర్‌ బెల్ట్‌ ద్వారా బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపుతున్నారు. దీనితో టన్నెల్‌ లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు.

Also Read : Sunita Williams: మార్చి నెలాఖర్లో భూమ్మీదకు సునీతా విలియమ్స్‌

Leave A Reply

Your Email Id will not be published!