Smita Sabharwal: స్మితా సభర్వాల్‌ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన జయశంకర్ యూనివర్శిటీ

స్మితా సభర్వాల్‌ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన జయశంకర్ యూనివర్శిటీ

Smita Sabharwal : తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ కు నోటీసులు జారీ చేసేందుకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ రంగం సిద్ధం చేస్తోంది. ఇన్నోవా వాహనం అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి యూనివర్సిటీకి చెల్లించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొనుంది. ఒకటి రెండు రోజుల్లో ఆమెకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితా సభర్వాల్(Smita Sabharwal) లేఖ మేరకు 2016 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు… నెలకు రూ.63 వేల చొప్పున అద్దె రూపంలో యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనం అద్దె పేరిట 90 నెలలకు రూ.61 లక్షలు తీసుకోవడాన్ని ఆడిట్‌ శాఖ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.

Smita Sabharwal Got Notices

స్మితా సభర్వాల్ అద్దెకు తీసుకున్న టీఎస్‌ 08 ఈసీ 6345 వాహనం నాన్‌ టాక్స్‌ కాదు, ఎల్లో ప్లేట్ వాహనం కాదు. ప్రైవేటు వ్యక్తిగత వాహనం పవన్‌కుమార్ పేరిట ఉన్నట్లు ఆడిట్ విచారణలో వెల్లడైంది. సీఎంవో స్మితా సభర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రశీదులు రావడంతో యూనివర్సిటీ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు తేల్చింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పనితీరుపై ఇటీవల ఏజీ జరిపిన విచారణలో కొన్ని తీవ్రమైన అవకతవకలు ఉన్నట్లు వెల్లడయ్యాయి. అందులో ఈ అంశం కూడా ఉంది. ఈ విషయంపై వివరణ కోరగా… స్మితా సభర్వాల్‌ వాహన అద్దెపై ఆడిట్‌ అభ్యంతరం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య అల్దాస్ జానయ్య అన్నారు.

ఏజీ ఆడిట్ ఆధారంగా అంతర్గత విచారణ, విశ్లేషణ జరిపించామని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయం పాలకవర్గం దృష్టికి తీసుకురావడం ద్వారా సమావేశంలో కూడా విస్తృతంగా చర్చించామని, ఈ విషయంపై సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నామని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, న్యాయనిపుణుల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వర్సిటీ వీసీ పేర్కొన్నారు.

Also Read : Mainpuri Court: దేహులి దళితుల ఊచకోత కేసులో మెయిన్‌పురి జిల్లా కోర్టు సంచలన తీర్పు

Leave A Reply

Your Email Id will not be published!