Smriti Mandhana : భారత జట్టు బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించారు. అద్భుత రికార్డు నమోదు చేశారు. ప్రపంచ క్రికెట్ లో
ఫార్మాట్ (టి20) లో అతి తక్కువ కాలంలో 2,000 వేల పరుగులు పూర్తి చేశారు.
శ్రీలంక పర్యటలో భాగంగా జరిగిన రెండో టి20 మ్యాచ్ లో ఈ ఫీట్ సాధించింది. భారత మహిళా క్రికెట్ లో రెండో క్రీడాకారిణిగా నిలిచారు
స్మృతి మంధాన(Smriti Mandhana). ఈ మ్యాచ్ లో 39 రన్స్ చేసింది.
మొత్తం 84 ఇన్నింగ్స్ ల్లో ఈ 2 వేలు చేశారు. ఇక మంధాన కంటే ముందు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 125 ఇన్సింగ్స్ లు ఆడి
3,313 పరుగులు చేశాడు.
ఇక భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 97 ఇన్నింగ్స్ లో ఆడి 3, 297 రన్స్ చేశాడు. ప్రస్తుత భారత మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 84
ఇన్నింగ్స్ ల్లో 2, 372 పరుగులు చేశాడు.
ఇటీవలే పదవీ విరమణ చేసిన హైదరాబాదీ క్రికెటర్ మిథాలీ రాజ్ 70 ఇన్నింగ్స్ ల్లో 2, 264 రన్స్ చేశారు. తాజాగా స్మృతి మంధాన 2 వేల మార్కును అందుకున్న ఐదో క్రికెటర్ గా చరిత్ర లిఖించారు.
ఇదిలా ఉండగా మూడు టి20 మ్యాచ్ ల సీరీస్ ను 2-0తో భారత మహిళా జట్టు గెలుపొంది కైవసం చేసుకుంది. ఇక వ్యక్తిగతంగా చూస్తే స్మృతి మంధాన(Smriti Mandhana) 18 జూలై 1996లో మహారాష్ట్రలో పుట్టారు.
పూర్తి పేరు స్మృతి శ్రీనివాస్ మంధాన. ఎడమ చేతి వాటం బ్యాటర్ , రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. 13 ఆగస్టు 2014లో ఇంగ్లాండ్ తో టెస్టు
అరంగేట్రం చేశారు.
10 ఏప్రిల్ 2013లో బంగ్లాదేశ్ తో వన్డే మ్యాచ్ ప్రారంభించింది. 5 ఏప్రిల్ 2013లో బంగ్లాదేశ్ తో టి20 మ్యాచ్ ఆడింది.
Also Read : రెండో టి20లో భారత్ గ్రాండ్ విక్టరీ