Sonali Phogat Case : సీబీఐకి సోనాలీ ఫోగట్ కేసు బదిలీ – సీఎం
ప్రకటించిన ప్రమోద్ సావంత్
Sonali Phogat Case : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టిక్ టాక్ స్టార్, హర్యానా భారతీయ జనతా పార్టీ నాయకురాలు సోనాలీ ఫోగట్ మృతి కేసుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు గోవా సీఎం ప్రమాద్ సావంత్.
ఆమె తన స్నేహితులతో కలిసి గోవాకు వెళ్లారు. అక్కడ తన అసిస్టెంట్, అతడి స్నేహితుడు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
ఇందుకు సంబంధించి పోస్టు మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. దీంతో ఆమె పాల్గొన్న రెస్టారెంట్ కర్లీస్ యజమానితో పాటు డ్రగ్స్ డీలర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదే విషయంపై సోనాలీ ఫోగట్ కేసును(Sonali Phogat Case) గోవా పోలీసులు నీరు గారుస్తున్నారంటూ ఆమె కుటుంబీకులు సంచలన ఆరోపణలు చేశారు.
అంతకు ముందు సోనాలీ ఫోగట్ ఫ్యామిలీ హర్యానా సీఎంను కలిసి సీబీఐ చేత విచారణ జరిపించాలని, అసలు దోషులు ఎవరో తేలుతుందని స్పష్టం చేశారు.
దీంతో సీఎం గోవా సీఎం సావంత్ కు ఫోన్ చేసి విచారణకు ఆదేశించాలని కోరారు. దీంతో తీవ్ర వత్తిళ్ల మధ్య ప్రమోద్ సావంత్ ఎట్టకేలకు దిగి వచ్చారు.
సోనాలీ ఫోగట్ కేసును సీబీఐకి దర్యాప్తు చేయాల్సిందిగా కోరుతున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర పోలీసులపై తనకు పూర్తి విశ్వాసం ఉందని , దర్యాప్తు బాగా జరుగుతోందన్నారు. హర్యానా నుంచి ఫోగట్ కుటుంబీకుల నుంచి పదే పదే డిమాండ్ చేయడంతో సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాస్తున్నట్లు చెప్పారు.
Also Read : పరివార్ లో షాజియా కామెంట్స్ పరేషాన్