Sonia Gandhi : రైలు ప్రమాదం సోనియా సంతాపం
అత్యంత బాధాకరమైన సంఘటన
Sonia Gandhi : ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు దుర్ఘటనలో 300 మందికి పైగా చని పోయారు. 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ సందర్భంగా రైలు ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీపీపీ చైర్ పర్సన్ , ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi). శనివారం ఆమె ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
ఏఐసీసీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి తాను చాలా బాధ పడ్డానని పేర్కొన్నారు సోనియా గాంధీ. అంతకు మించి వేదనకు గురయ్యానని తెలిపారు. మృతుల కుటుంబాలందరికీ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ చేస్తున్నట్లు స్పష్టం చేశారు సోనియా గాంధీ. తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భగా పార్టీ శ్రేణులు, నాయకులందరికీ ఆమె కీలక సూచన చేశారు. ప్రమాదం జరిగిన ఘటనలో గాయపడిన వారికి సేవలు అందించడంలో, ఘటనా స్థలానికి చేరుకుని వీలైనంత మేర సహాయం చేయాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటి పట్ల సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని పేర్కొన్నారు సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ.
Also Read : Sex Championship