Sonia Gandhi : సరిహద్దు వివాదం సోనియా ఆగ్రహం
కేంద్ర సర్కార్ తీరుపై సీరియస్
Sonia Gandhi : భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా , భారత్ జవాన్లు ఘర్షణ పడటం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. పార్లమెంట్ లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీనిపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టాయి. కానీ అటు లోక్ సభ చైర్మన్ ఓం బిర్లా ఇటు రాజ్యసభ చైర్మన్ , ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ ఒప్పుకోలేదు.
ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ క్లారిటీ ఇచ్చారని స్పష్టం చేశారు. దీనిపై చర్చించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) . ఇరు వైపుల నుండి సైనికులకు గాయాలైనా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు.
పూర్తిగా బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శిస్తోందంటూ మండిపడ్డారు. ఈ విపత్కర సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారంటూ సోనియా గాంధీ ప్రశ్నించారు. భారత్, చైనా ఘర్షణలపై చర్చకు అనుమతించడం లేదని ఆమె మండిపడ్డారు.
పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సర్వ సభ్య సమావేశంలో పార్టీ ఎంపీలను ఉద్దేశించి సోనియా గాంధీ మాట్లాడారు.
ముఖ్యమైన జాతీయ పరంగా సవాల్ ను దుర్కొంటున్నప్పుడు పార్లమెంట్ ను విశ్వాసం లోకి తీసుకు రావడం మన దేశంలో సంప్రదాయమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంతటి ప్రధానమైన సమస్యన ప్రజా దేవాలయంలో చర్చకు అవకాశం ఇవ్వక పోవడం దారుణమన్నారు సోనియా గాంధీ.
Also Read : కర్ణాటకకు వెళ్లేందుకు పర్మిషన్ ఎందుకు