Sanjay Raut : క‌ర్ణాట‌క‌కు వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఎందుకు

శివ‌సేన పార్టీ ఎంపీ సంజ‌య్ రౌత్ కామెంట్స్

Sanjay Raut : శివ‌సేన (బాల్ ఠాక్రే) పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut)  షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. తాజాగా మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. కొన్నేళ్ల నుంచి ఇరు రాష్ట్రాలు ఘ‌ర్ష‌ణ‌కు దిగుతున్నాయి.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క లోని బెల‌గావిలో శాస‌న‌స‌భ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. మ‌హా వికాస్ అఘాడీ ఆధ్వ‌ర్యంలో ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఉద్రిక్త‌త నెల‌కొంది. ఓ మైపు మహారాష్ట్ర ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌డితే మ‌రో వైపు క‌ర్ణాట‌క ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఆధ్వ‌ర్యంలో మ‌రాఠాకు చెందిన వాహ‌నాల‌పై దాడుల‌కు దిగారు.

దీంతో నువ్వా నేనా అన్న రీతిలో ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగాయి. జాతీయ ర‌హ‌దారిపై భారీ ఎత్తున పోలీసులు మోహ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut)  కేంద్రంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ వైపు చైనా భార‌త్ లోకి ప్ర‌వేశించేందుకు య‌త్నిస్తోంద‌ని కానీ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా తాము తీవ్ర‌వాదులం కామ‌ని, తాము కూడా ఈ దేశంలో భాగమేన‌ని పేర్కొన్నారు. అయితే పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌లో ప్ర‌వేశించేందుకు లేదా వెళ్లేందుకు కేంద్రం, బీజేపీ, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు సంజ‌య్ రౌత్.

Also Read : స‌వాల్ స‌రే క‌విత లిక్క‌ర్ స్కాం క‌థేంటి

Leave A Reply

Your Email Id will not be published!