Sonu Sood : సోనూ సూద్ సాయం ఆపరేషన్ విజయవంతం
ఎనిమిది అవయవాలతో పుట్టిన చిన్నారి
Sonu Sood : దేశ వ్యాప్తంగా మరోసారి వార్తల్లో నిలిచారు ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood) . ఆయన నటుడిగా కంటే సాయం చేయడంలో, దాతృత్వాన్ని చాటడంలో మరింత పాపులర్ అయ్యారు.
తాజాగా సోనూ చేసిన హెల్ప్ చర్చనీయాంశంగా మారింది. సోనూ సూద్ స్వయంగా ఓ చిన్నారి కన్నీటి కథను పంచుకున్నారు సామాజిక మాధ్యమం ద్వారా. ఇప్పుడు ఆ ఫోటో వైరల్ గా మారింది.
లెక్కలేనన్ని ప్రశంసలు లభిస్తున్నాయి. సాయం చేయాలన్న తలంపు ఉంటే చాలదు అది ఆచరణలో ఉండాలన్నదే సోనూ సూద్ లక్ష్యం. తన అభిమతం కూడా.
ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు వచ్చినా ఈ నటుడు ఆపన్నులకు సాయం చేయడం మాత్రం మాను కోవడం లేదు. ఎనిమిది అవయవాలు ఉన్న బిడ్డకు సోనూ సూద్ చేసిన సహాయం ఇప్పుడు మరింత ప్రశంసించేలా చేసింది.
స్పూర్తి దాయకమైన కథ ఎందరినో కంట తడి పెట్టించేలా చేస్తోంది. చౌముఖీ కుమారి అనే బిడ్డ కథను తెలిపారు. ఆ పాప నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టింది. ఆ పాప పరిస్థితిని గుర్తించిన సోనూ సూద్(Sonu Sood) ఆపరేషన్ కోసం నిధులు సమకూర్చారు.
శస్త్ర చికిత్స సక్సెస్ కావడంతో ఆ పాప ఫోటోను షేర్ చేశారు. ఈ భూమి మీద ఉండాల్సిన వ్యక్తులలో మీరు కూడా ఒకరు అంటూ పలువురు నటులు కీర్తించారు సోనూ సూద్ ను.
ఈ సందర్భంగా ఆయన ఓ అందమైన క్యాప్షన్ కూడా జత చేశారు. చౌముఖి కుమారి..నేను చేసిన జర్నీ విజయవంతం అయ్యిందని పేర్కొన్నారు. కాగా సునీల్ శెట్టి, పూజా బాత్రా, తదితరులు ప్రశంసించారు.
Also Read : విక్రమ్ విజయం కమల్ సంతోషం