#SonuSood : బాలీవుడ్ క్రాక్ లో సోనూ సూద్
క్రాక్ మూవీ టీంతో సోనూ సూద్ చర్చలు
Sonu Sood : గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహరాజా నటించిన తాజా చిత్రం క్రాక్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లలో దూసుకు పోతోంది. 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉన్నప్పటికీ సంక్రాంతి పండగ సందర్భంగా పలు సినిమాలు విడుదలయ్యాయి. విజయ్ మాస్టర్, రామ్ పోతినేని రెడ్, క్రాక్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాల్లో రెండు స్ట్రెయిట్ సినిమాలు అయితే మాస్టర్ తమిళ సినిమా. ఇక డాన్ శ్రీను, బలుపు చిత్రాల తర్వాత గోపిచంద్, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం క్రాక్ విడుదలై క్రాక్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
కలెక్షన్ల పరంగా దుమ్ము దులుపుతోంది. కొత్త ఏడాది తొలి భారీ విజయం అందుకున్న ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా హక్కుల కోసం పలువురు బాలీవుడ్ బడా నిర్మాతలు పోడీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక రియల్ హీరోగా పేరొందిన సోనూ సూద్ క్రాక్ ను బాలీవుడ్ లోకి తీసుకెళ్ల బోతున్నాడట. అంతే కాదు ఈ సినిమాను సోనూ సూద్(Sonu Sood )స్వయంగా నిర్మించబోతున్నారట. హిందీ రీమేక్ హక్కుల కోసం ఇప్పటికే నిర్మాత బి. మధును సోనూ సూద్ సంప్రదించారని, వారిద్దరి మధ్య బేరసారాలు జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ వార్త నిజమే అయితే కనుక హీరో సోనూ సూద్(Sonu Sood )తొలి హిందీ చిత్రం క్రాక్ రీమేక్ అవుతుంది. దీనికి గోపిచంద్ మలినేనిని డైరెక్టర్ గా తీసుకుంటాడా లేక హిందీ పరిశ్రమకు చెందిన వారిని ఎంపిక చేసుకుంటాడా అన్నది తేలాల్సి ఉంది. అయితే సోనూ సూద్ తెలుగులో అల్లుడు అదుర్స్ సినిమాలో కనిపించారు. ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో దుమ్ము రేపుతుంటే మరి హిందీలో ఈ క్రాక్ మూవీ ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో వేచి చూడాలి.
No comment allowed please