#Pesarattu : ఆంధ్ర స్టైల్ నోరూరించే పెసరట్టు

పెసరట్టు కోస్తా ఆంధ్రలో ఫేమస్ వంటకం.

Pesarattu : పెసరట్టు అంటే తెలియని తెలుగువారు ఉండరు. దీనిని ఉదయంపూట అల్పాహారంగా తింటారు. ఇది కోస్తా ఆంధ్రలో ఫేమస్ వంటకం. ఈ పెసరట్టు కొబ్బరి చట్నీతో తింటే అద్భుతమైన రుచిని అంధిస్తుంది. ఇప్పుడు మనం పెసరట్టుకు కావలసిన పదార్ధాలు, తయారుచేయు విధానం తెలుసుకుందాం.

కావలసిన పదార్ధాలు :

పెసలు – 2 కప్పులు
పచ్చిమిర్చి – 2
అల్లం – చిన్న ముక్క
ఇంగువ – చిటికెడు
బియ్యం పిండి – 1/4 కప్పు
కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడ
నెయ్యి – ఫ్రై చేసుకోవడానికి సరిపడ
ఉల్లిపాయ – 1

తయారుచేయు విధానం :

ముందుగా పెసలను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం నీరు వంపేసి, మిక్సీలో వేసి, వాటితో పాటు పచ్చిమిర్చి, అల్లం, ఇంగువ, బియ్యం, కొత్తిమీర, ఉప్పు వేసి మొత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి వేడయ్యాక గరిటతో పిండి తీసుకొని దోసెలాగ వేసుకోవాలి. తర్వాత ఫ్రై అవుతున్న పెసరట్టు మీద కొద్దిగా నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు చల్లుకొని మీడియం మంట మీద కాలనివ్వాలి. పెసరట్టు బ్రౌన్ కలర్ లో మారిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ పెసరట్టు రెడీ అయినట్లే.

 

No comment allowed please