Worlds Richest IPL : ఐపీఎల్ పై కన్నేసిన సౌదీ అరేబియా
ముందుగా తేరుకున్న బీసీసీఐ
Worlds Richest IPL : ప్రపంచ క్రికెట్ రంగాన్ని శాసిస్తోంది బీసీసీఐ ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) . భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లకు కాసుల పంట పండుతోంది. బీసీసీఐకి కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తోంది. అయితే పొట్టి ఫార్మాట్ (టి20)కు ప్రత్యామ్నాయంగా టి10 లీగ్ పేరుతో టోర్నీలు నిర్వహించినా టి20 ఫార్మాట్ ముందు చిన్న బోయాయి. విండీస్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ , తదితర దేశాలలో లీగ్ లు నిర్వహిస్తున్నా భారత్ చేపట్టే ఐపీఎల్ కు పోటీ ఇవ్వలేక పోయాయి.
ఇక క్రికెట్ కు సంబంధించి ఏదైనా టోర్నీ చేపట్టాలన్నా లేక మార్పులు చేయాలన్నా ముందుగా అనుమతి ఇవ్వాల్సింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ప్రస్తుతం బీసీసీఐ అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థగా నిలిచింది. దీనిని దెబ్బ కొట్టేందుకు సౌదీ అరేబియా రంగంలోకి దిగింది. ఈ మేరకు ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ఐపీఎల్ ను(Worlds Richest IPL) నిర్వహించాలని డిసైడ్ అయ్యింది.
ఇందుకు సంబంధించి గత ఏడాది నుంచి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా సంస్థ ది ఏజ్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అది తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీసీసీఐ కూడా స్పందించింది. ఐపీఎల్ నిర్వహణను తాము అడ్డుకోలేమేని కానీ తమ దేశానికి చెందిన ఆటగాళ్లు ఎవరూ ఆ లీగ్ లో ఆడబోరంటూ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఫార్ములా 1 పోటీలకు పచ్చ జెండా ఊపింది సౌదీ అరేబియా. ఇప్పటికే ప్రపంచ ఫుట్ బాల్ టోర్నీని విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు ఐపీఎల్ పై కన్నేసింది. వరల్డ్ రిచెస్ట్ టి20 లీగ్ దిశగా అడుగులు వేస్తోంది.
దీనికి సంబంధించి సౌదీ బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలతో కూడా చర్చలు జరిపినట్లు టాక్. తమ ప్లాన్ ను కూడా చెప్పినట్లు టాక్. ఇప్పటికే ఐపీఎల్ టి20 పోటీలకు యూఏఈ ఆతిథ్యం ఇస్తోంది. మరి రిచెస్ట్ లీగ్ చేపడితే ఐపీఎల్ కు ఉన్న ప్రజాదరణ తగ్గడం ఖాయం అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
Also Read : సౌదీ క్రికెట్ లీగ్ లో మనోళ్లు ఆడరు