Sourav Ganguly Comment : పొమ్మనకుండా పొగ పెట్టారా
దాదా నిష్క్రమణ వెనుక కథేంటి
Sourav Ganguly Comment : రాజకీయాలు వేరు రాజకీయం చేయడం వేరు. ఎప్పుడైతే క్రీడలు పవర్ సెంటర్ గా మారాయో కనిపించకుండానే పాలిటిక్స్ ఎంట్రీ ఇస్తాయి. ఇది కాదనలేని సత్యం.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)(BCCI) కార్యవర్గం ఎన్నిక. అక్టోబర్ 18న జరగనుంది.
ఇప్పటికే ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో కూడా ముందుగానే ఫిక్స్ చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పేరుకే ఎన్నిక కానీ అంతా ఏకగ్రీవమే లోపాయికారి ఒప్పందమే.
ఇక ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన క్రీడా సంస్థల్లో బీసీసీఐ ఒకటి. అందుకే దానిపై అంత మోజు. చెప్పలేనంత క్రేజు.
తాజాగా దీనికి కేంద్ర బిందువుగా సెంటర్ ఆఫ్ ది పాయింట్ గా మారారు ఒకప్పటి భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ బాస్ గా ఉన్న సౌరవ్ గంగూలీ అలియాస్ దాదా లేదా బెంగాల్ టైగర్. ప్రస్తుతం దేశ రాజకీయాలనే కాదు అన్ని రంగాలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ శాసిస్తోంది.
దానిని మోదీ ముందుండి నడిపిస్తుంటే వెనుక నుంచి కంట్రోల్ చేస్తూ చక్రం తిప్పుతూ వస్తున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah). ఇంకేం ఆయన కన్ను బీసీసీఐపై పడింది.
తను ఎలాగూ రాలేడు. కనుక తనయుడు జే షాను తెలివిగా రంగంలోకి దించాడు. ఆపై కార్యదర్శిగా ఎంటర్ అయ్యాడు.
ఇప్పుడు బీసీసీఐ మొత్తం అతడి కనుసన్నలలోనే నడుస్తోందంటే ఆశ్చర్యం వేయక మానదు. ఒకప్పుడు సంస్థ అంటే రాజకీయాలకు అతీతంగా
ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండేది.
కానీ రాను రాను రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తులు నేరుగా లేక పోయినా వారి వారసులు ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు.
వారిలో ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒకరు జే షా(Jay Shah) ఇంకొకరు తరుణ్ ధుమాల్. ఇతను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు.
ప్రధాని మోదీ మాత్రం ప్రతి సారి ఒకరికి ఒకే పదవి అని చెబుతూ ఉంటారు. కానీ ఆచరణలో వారి నేతలతో పాటు కుటుంబీకులకు కూడా పదవులు దక్కుతున్నాయి.
దీనిని ఎవరూ ప్రశ్నించరు. ఆ మధ్యన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన ఏకంగా జే షాను టార్గెట్ చేశారు. ఎన్ని సెంచరీలు కొట్టాడని బీసీసీఐ కార్యదర్శిగా ఉన్నాడని ప్రశ్నించాడు.
ఇది పక్కన పెడితే బీసీసీఐని పూర్తి పారదర్శకతతో ప్లాట్ ఫారమ్ మీదకు తీసుకు వచ్చేలా చేయడంలో గంగూలీ సక్సెస్ అయ్యాడు.
కానీ అమిత్ షాను కాదని ఏం చేయలగడు కేవలం తల ఊపడం తప్ప. ఆయన తప్పు కోవడం ఖాయమై పోయింది. ఇక జే షా మాత్రం రెండోసారి
కార్యదర్శి కానున్నారు. ఇక ఐపీఎల్ చైర్మన్ రేసులో ఉంటారని భావించిన గంగూలీకి బీసీసీఐ నుంచి రిక్త హస్తం ఇచ్చినట్లు టాక్.
ఓ వైపు నమ్మకంగా ఉంటూనే సౌరవ్ గంగూలీకి(Sourav Ganguly) కోలుకోలేని దెబ్బ కొట్టారని అది ఎవరనేది తెలుసు కోవాలంటే కొంత కాలం వేచి చూడాలనేది టాక్.
మరో వైపు సోషల్ మీడియాలో గంగూలీ నిష్క్రమణ వెనుక కామెంట్స్ వస్తున్నా ఇప్పుడు చేసేది ఏమీ ఉండదు. ఎందుకంటే దేశమే మోదీ,
అమిత్ షా కనుసన్నలలో నడుస్తోంది. ఇక ఎవరు ఏం చేయగలరు. వాళ్లను కాదని దాదా నిలబడగలడా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా. పవర్ చేతిలో ఉంటే ఏదైనా జరుగుతుందని చెప్పడానికి బీసీసీఐ బాస్ కథ ఓ ఉదాహరణ మాత్రమే. అందుకే అధికారం చుట్టే అన్నీ తిరుగుతుతాయి. గుమి గూడుతాయి. కాదనలేం కదూ.
Also Read : నెట్టింట్లో కోహ్లీ గంగూలీ మీమ్స్ వైరల్