Sourav Ganguly : సంజూ శాంసన్ అద్భుత ఆటగాడు
కితాబు ఇచ్చిన బీసీసీఐ చీఫ్ గంగూలీ
Sourav Ganguly : భారత క్రికెట్ జట్టులో ఇప్పుడు సంజూ శాంసన్(Sanju Samson) చర్చనీయాంశంగా మారాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ ) సెలెక్షన్ కమిటీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రధానంగా అద్భుతంగా రాణించినా అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో జరిగే టి20 వరల్డ్ కప్ కు టీమిండియాకు ఎంపిక చేయలేదు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది.
సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చోటు చేసుకున్నాయి. తాజా, మాజీ ఆటగాళ్లు సైతం సంజూ శాంసన్ కు అన్యాయం జరిగిందంటూ నిప్పులు చెరిగారు. దీంతో ఎట్టకేలకు తన తప్పును తెలుసుకుంది బీసీసీఐ(BCCI). చివరకు వత్తిళ్లకు తలొగ్గిన సెలక్షన్ కమిటీ భారత – ఎ జట్టుకు కెప్టెన్ గా నియమించింది.
తాజాగా భారత్ లో పర్యటించిన న్యూజిలాండ్ -ఎ జట్టుతో జరిగిన మూడు వన్డేల సీరీస్ ను సంజూ శాంసన్ సారథ్యంలోని భారత్ – ఎ క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి మూడో వన్డే మ్యాచ్ లో దుమ్ము రేపాడు. అటు బ్యాటర్ గా ఇటు కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడు.
సౌతాఫ్రికాతో జరిగే టి20 సీరీస్ కు కూడా ఎంపిక చేయక పోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సంజూ శాంసన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly). రాబోయే దక్షిణాఫ్రికా వన్డే సీరీస్ కు అతడిని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నాడు. సంజూ శాంసన్ బాగా ఆడుతున్నాడు. భారత్ కోసం ఆడాడు. కానీ వరల్డ్ కప్ కు దూరమయ్యాడు.
Also Read : రెస్టాఫ్ ఇండియా స్కిప్పర్ గా విహారి