Sourav Ganguly : మహిళా క్రికెటర్ల ఆట అద్భుతం – దాదా
రజతం సాధించిన జట్టుకు అభినందన
Sourav Ganguly : బ్రిటన్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో మొదటిసారిగా ప్రవేశ పెట్టిన మహిళా క్రికెట్ పోటీల్లో భారత జట్టు సత్తా చాటింది. ఫైనల్ కు చేరింది. చివరి వరకు పోరాడింది.
ఆసిస్ జట్టు చేతిలో 9 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. ఆసిస్ కు బంగారు పతకం దక్కించుకుంటే భారత మహిళా జట్టు రజత పతకం మూటగట్టుకుంది.
ఈ సందర్భంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) స్పందించాడు. మహిళా క్రికెటర్లు అద్బుతంగా ఆడారంటూ కితాబు ఇచ్చాడు.
రజత పతకం గెలిచినందుకు ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నాడు. కొద్ది పాటి తేడాతో బంగారు పతకాన్ని పోగొట్టు కోవడం వల్ల నిరాశ చెందడం మామూలేనని కానీ మీరు ఆడిన తీరు మాత్రం అద్భుతమన్నారు.
ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అనంతరం 19.4 ఓవర్లలో 152 పరుగులకు చాప చుట్టేసింది.
ఈ ఈవెంట్ లో అద్భుతంగా ఆడిన స్మృతీ మంధాన ఫైనల్ మ్యాచ్ లో నిరాశ పరిచింది. కానీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సత్తా చాటింది. 65 పరుగులు చేసింది. భారత్ తరపున రేణుకా సింగ్ , స్నేహ రాణా రెండేసి వికెట్లతో వెనుదిరిగారు.
మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడారు. కొన్ని పొరపాట్లు చేశాం. స్వర్ణానికి దగ్గరగా ఉన్నామని అన్నారు.
Also Read : భారత మహిళా జట్టుకు రజతం