Sports Authority Of India : మహిళా క్రీడాకారిణిలకు ఖుష్ కబర్
ఇక నుంచి మహిళా కోచ్ లు
Sports Authority Of India : పురుష కోచ్ లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా క్రీడాకారులకు తీపి కబురు చెప్పింది కేంద్ర సర్కార్. ఈ మేరకు భారత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(Sports Authority Of India) (సాయ్ ) ఖుష్ కబర్ చెప్పింది.
గత కొంత కాలం నుంచి మహిళలకు సంబంధించి మహిళలే కోచ్ లుగా ఉండాలని అభ్యర్థనలు వచ్చాయి. పురుష కోచ్ లు మహిళా క్రీడాకారిణిల పట్ల అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వచ్చాయి.
వీటిని పరిగణలోకి తీసుకున్న సాయ్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక నుంచి మహిళా జట్లు ఆడేందుకు ఎక్కడికి వెళ్లినా విమెన్ కోచ్ లు విధిగా నియమించాలని జాతీయ క్రీడా(Sports Authority Of India) సమాఖ్య దేశంలోని అన్ని క్రీడా సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏ మాత్రం రూల్స్ అతిక్రమించినా ఒప్పుకునే ప్రసక్తి లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది సాయ్. ఇందులో భాగంగా దేశీవాలీ టోర్నీలతో పాటు విదేశీ టూర్ లకు వెళ్లే అమ్మాయిల టీమ్ లో మహిళా కోచ్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా స్లోవేనియాలో జరిగిన పోటీలకు వెళ్లిన మహిళా సైక్లిస్ట్ పట్ల కోచ్ శర్మ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధిత క్రీడాకారిణి ఆరోపణలు చేయడం కలకలం రేగింది.
ఫిర్యాదు కూడా చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జర్మనీలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. దీంతో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిని సీరియస్ గా తీసుకున్నారు.
Also Read : ఆడపిల్లలు ఆడడం ఆనందంగా ఉంది