SRH IPL 2023 Auction : టాప్ ప్లేయర్లకు ‘హైదరాబాద్’ ఛాన్స్
బ్రూక్ కోసం భారీ ధర చెల్లింపు
SRH IPL 2023 Auction : కావ్య మారన్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్(SRH IPL 2023 Auction) ఈసారి జరిగిన మినీ వేలం పాటలో కీలకమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. ఈసారి జరిగిన ఐపీఎల్ లో ఎస్ ఆర్ హెచ్ దారుణమైన ప్రదర్శనతో నిరాశ పరిచింది. యువ ఆటగాళ్లతో పాటు సీనియర్లను సమ పాళ్లలో ఎంపిక చేసింది. ఈ మొత్తం ఎంపిక అంతా కావ్య మరన్ కనుసన్నలలో జరిగింది. మరోసారి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.
రిచ్ లీగ్ లో 14 మ్యాచ్ లకు గాను హైదరాబాద్ 8 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. కేవలం ఆరు మ్యాచ్ లలో గెలుపొందింది. హ్యారీ బ్రూక్ ను ఏకంగా రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేయడం మిగతా జట్లను విస్తు పోయేలా చేసింది. అతడి తర్వాత మయాంక్ అగర్వాల్ ను రూ. 8.25 కోట్లకు వెచ్చించింది.
ఈసారి సంచలన నిర్ణయం తీసుకుంది మేనేజ్ మెంట్ . ఏకంగా 13 మంది ఆటగాళ్లను తొలగించింది. కేన్ మామతో పాటు నికోలస్ పూరన్ ను విడుదల చేసింది.
ఇక వేలం పాటలో భారీ ఎత్తున కొనుగోలు చేసింది. మొత్తం ఐపీఎల్ జట్లలో అత్యధికంగా డబ్బులు కలిగిన టీమ్ గా ఎస్ ఆర్ హెచ్ నిలిచింది. వీరిలో నితీశ్ రెడ్డి, అన్మోల్ ప్రీత్ సింగ్ , అకేల్ హోసేన్ , మయాంక్ చాగర్ , ఉపేంద్ర యాదవ్ , సన్వీర్ సింగ్ , వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్ , మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్ , హెన్రిచ్ క్లాసెన్ , మయాంక్ అగర్వాల్ , బ్రూక్ ఉన్నారు.
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో సుందర్ , జాన్సన్ , అభిషేక్ శర్మ, గ్లేన్ ఫిలిప్స్ , రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్ , నటరాజన్ , భువీ, కార్తీక్ త్యాగి, ఫారూఖీ, మార్క్రామ్ , సమద్ ఉన్నారు.
Also Read : కావ్య మారన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్