KKR vs SRH IPL 2023 : క‌ల‌క‌త్తా జోరు హైద‌రాబాద్ హుషారు

స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ నైట్ రైడ‌ర్స్

KKR vs SRH IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా శుక్ర‌వారం కీల‌క‌మైన మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. కేకేఆర్(KKR vs SRH IPL 2023) ఇప్ప‌టి దాకా మూడు మ్యాచ్ లు ఆడి 2 మ్యాచ్ ల‌లో గెలుపొందింది. ఒక మ్యాచ్ లో ఓట‌మి పాలైంది.

ఇక స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ మూడు మ్యాచ్ లు 2 మ్యాచ్ ల‌లో ప‌రాజ‌యం పొంద‌గా ఒక మ్యాచ్ లో విజ‌యం సాధించింది. తొలి మ్యాచ్ లో ఆజ‌ట్టు సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో భారీ తేడాతో ఓట‌మి పాలైంది. ఇక పంజాబ్ కింగ్స్ ను ఓడించింది తొలి బోణీ కొట్టింది.

మ‌రో వైపు కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఫుల్ స్వింగ్ లో ఉంది. బ‌ల‌మైన జ‌ట్టుగా పేరొందిన డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ కు చుక్క‌లు చూపించింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఈ కీల‌క పోరులో బిగ్ షాక్ ఇచ్చింది. ఆ జ‌ట్టుకు చెందిన రింకూ సింగ్ కొట్టిన దెబ్బ‌కు గుజ‌రాత్ తేరుకోలేక పోయింది.

కోల్ క‌తా ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ప్ర‌ధానంగా హోం గ్రౌండ్ కావ‌డం ఆ జ‌ట్టుకు మ‌రింత లాభించ‌నుంది. ఏప్రిల్ 14న రాత్రి 7.30 గంట‌ల‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇరు జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 23 సార్లు త‌ల‌ప‌డ్డాయి. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ 15 సార్లు గెలుపొందగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్  8 సార్లు విజ‌యం సాధించింది. ఇరు జ‌ట్ల అత్య‌ధిక స్కోర్ 180 ర‌న్స్ .

Also Read : మొహాలీలో ప్రీతి జింటా సంద‌డి

 

Leave A Reply

Your Email Id will not be published!