ఐపీఎల్ 16వ సీజన్ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ తప్పుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 182 రన్స్ చేసింది.
అనంతరం 183 రన్స్ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ గెలుపుతో లక్నో ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. మన్కడ్ దుమ్ము రేపాడు. తన కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 35 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. మార్కస్ స్టోయినిస్ 40 రన్స్ చేస్తే క్వింటన్ డికాక్ 29 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో హెన్రిచ్ క్లాసెన్ రాణించాడు. 47 పరుగులు చేశాడు. అబ్దుల్ సమద్ 37 పరుగులతో ఆకట్టుకున్నాడు. నాటౌట్ గా మిగిలాడు. ఇక ఓపెనర్ అన్మోల్ ప్రీత్ సింగ్ 36 కీలక పరుగులు చేశాడు. ఇక లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీస్తే , యుధ్వీర్ , అవేష్ ఖాన్ , యశ్ ఠాకూర్ , మిశ్రా చెరో వికెట్ తీశారు.
జట్ల పరంగా చూస్తే లక్నో జట్టులో డికాక్ , మేయర్స్ , పాండ్యా (కెప్టెన్ ) , మన్కడ్ , స్టోయినిస్ , పూరన్ , మిశ్రా, ఠాకూర్ , బిష్నోయ్ , సింగ్ చరక్ , అవేష్ ఖాన్ ఆడారు.
హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ , అన్మోల్ ప్రీత్ సింగ్ , రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్) , క్లాసెన్ , గ్లెన్ ఫిలిప్స్ ,సమద్ , టి. నటరాజన్ , మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్ , ఫరూఖీ ఆడారు.