Sri Lanka ODI Squad : 21 మందితో శ్రీలంక వన్డే జట్టు డిక్లేర్
ప్రకటించిన లంక క్రికెట్ బోర్డు
Sri Lanka ODI Squad : స్వదేశంలో ఆసిస్ తో జరిగే వన్డే సీరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు(Sri Lanka ODI Squad) జట్టును ప్రకటించింది. శుక్రవారం 21 మంది సభ్యులతో కూడిన టీంను ఎంపిక చేసింది. ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది.
ఇదిలా ఉండగా గాయం కారణంగా తప్పుకున్న స్టార్ స్పిన్నర్ హసరంగ తిరిగి జట్టులోకి చేరాడు. విచిత్రం ఏమిటంటే ఇతడి బౌలింగ్ లో ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ ఆరు సార్లు ఔట్ అయ్యాడు.
బంతుల్ని తిప్పుతూ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టించే ఈ స్పిన్నర్ శ్రీలంక(Sri Lanka ODI Squad) జట్టుకు అదనపు బలం కూడా. ఆసిస్ బ్యాటర్లకు ఇక చుక్కలు చూపించడం ఖాయం. గాయం వల్ల జింబాబ్వే సీరీస్ కు ఆడలేక పోయాడు వనిందు హసరంగ.
ఇక శ్రీలంక అండర్ -19 జట్టు కెప్టెన్ దునిత్ వెల్లలగే ను శ్రీలంక బోర్డు ఆడేందుకు చాన్స్ ఇచ్చింది. ఇది ఒక రకంగా తన కెరీర్ లో శుభ పరిణామం. ఇక మ్యాచ్ ల విషయానికి వస్తే ఆస్ట్రేలియాతో శ్రీలంక ఐదు వన్డే మ్యాచ్ లు ఆడనుంది.
పల్లెకెలె వేదికగా ఈనెల 14న మొదటి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీ20 సీరీస్ ను 2-0 తేడాతో చేజిక్కించుకుంది. ప్రధానంగా ఆ జట్టులో వార్నర్ సూపర్ ఫామ్ లోకి రావడం అదనపు బలంగా మారింది.
జట్టు పరంగా చూస్తే దసున్ షనుక, నిస్సాంక, దనుష్క, గుణ తిలక, కుసల్ మెండిస్ , చరిత్ అసలంక ఉన్నారు. ధనంజయ డిసిల్వ, చండిమాల్ , భానుక , డిక్వెల్లా, వనిందు, చమిక కరుణ రత్నె ఆడతారు.
దుష్యంత చమీర, అసిత, తుషార మ, అసిత, రమేష్ తుషార , వాండర్సే, మధుశంక, వెల్లలగే, మదుషన్ ఎంపికయ్యారు.
Also Read : కిల్లర్ ఇన్నింగ్స్ ఆడిన మిల్లర్