Sri Lanka VS Namibia : టి20 వరల్డ్ కప్ లో నమీబియా సెన్సేషన్
శ్రీలంకపై 55 పరుగుల తేడతో విక్టరీ
Sri Lanka VS Namibia : యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో ఘనంగా ప్రారంభమైంది. ఎప్పటి లాగే ఊహించని రీతిలో ప్రారంభ మ్యాచ్ లో లంకేయులపై నమీబియా(Sri Lanka VS Namibia) ఘన విజయాన్ని నమోదు చేసింది. అందరినీ విస్తు పోయేలా చేసింది. తామేమీ తక్కువ కాదంటూ చాటి చెప్పింది.
క్వాలిఫయర్ లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో ఏకంగా శ్రీలంకపై 55 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. తాజాగా యూఏఈ వేదికగా బలమైన పాకిస్తాన్ ను ఓడించి ఆసియా కప్ ను గెలుచుకున్న శ్రీలంక ఉన్నట్టుండి అనామక జట్టుగా భావించిన నమీబియాపై ఓటమి పాలు కావడం ఆశ్చర్యానికి గురి చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకు చాప చుట్టేసింది. నమీబియా బౌలర్లు డేవిడ్ వైస్ , ప్రైలింక్ , బెర్నార్డ్ స్కోల్డ్ , బెన్ షికోంగోలు మొదటి మూడు ప్రారంభ రౌండ్ మ్యాచ్ లో చెరో రెండు వికెట్ల చొప్పున తీశారు.
ఫ్రైలింక్ , జేజే స్మిత్ ఆఖరులో నమీబియా స్కోర్ పెంచేందుకు ప్రయత్నం చేశారు. గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో అరంగేట్రం చేశారు నమీబియా ఆటగాళ్లు. సూపర్ 12వ స్థానానికి చేరుకున్నారు.
కుసాల్ మెండీస్ , నిస్సాంక నిరాశ పరిచారు. భానుక రాజపక్సే కూడా పెవిలియన్ దారి పట్టాడు. రాజపక్సే , కెప్టెన్ ధసున్ షనక 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ చివరకు నమీబియా దెబ్బకు చాప చుట్టేశారు.
Also Read : ఒకే ఫ్రేమ్ లో 16 మంది కెప్టెన్లు