Sri Lankan Army Chief : ఆందోళన వద్దు సహకరించండి ప్లీజ్
శ్రీలంక ఆర్మీ చీఫ్ శవేంద్ర సిల్వా
Sri Lankan Army Chief : శ్రీలంకలో సంక్షోభం ముదిరి పాకాన పడింది. నిరసనలు, ఆందోళనలతో దేశం అట్టుడుకుతోంది. దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే దేశం విడిచి ఆర్మీ సపోర్ట్ తో పారి పోయాడు మాల్దీవులకు.
మరో వైపు ప్రధాన మంత్రిగా ఉన్న రణిలే విక్రమ సింఘే ఇవాళ తాత్కాలిక చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ తరుణంలో పీఎం కార్యాలయంలోకి చొచ్చుకు పోయారు ఆందోళనకారులు.
ఆపై భవనంపై దేశం జాతీయ జెండాలను ఎగుర వేశారు. భారీ ఎత్తున గుమి గూడిన జనాన్ని కంట్రోల్ చేయడం తమ వల్ల కాదంటూ శ్రీలంక ఆర్మీ, సాయుధ, నేవీ బలగాలు చేతులెత్తేశాయి.
ఇదిలా ఉండగా ఇవాళ ప్రయోగించిన టియర్ గ్యాస్ కారణంగా 26 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో లంకేయుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రెసిడెంట్, ప్రధాని రాజీనామాలు చేయాలంటూ డిమాండ్ మరింత ఊపందుకుంది.
ఈ తరుణంలో శ్రీలంక ఆర్మీ చీఫ్(Sri Lankan Army Chief) శవేంద్ర సిల్వా బుధవారం కీలక ప్రకటన చేశారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, లా అండ్ ఆర్డర్ కు సహకరించాలని కోరారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేయవద్దంటూ సిల్వా కోరారు.
అయితే రాజపక్సే దంపతులు మాల్దీవులకు పారి పోయారంటూ తెలిపారు. ఇదిలా ఉండగా ద్వీప దేశం అత్యంత దారుణమైన ఆర్థిక , రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అఖిలపక్ష నేతల సమావేశానికి పిలుపు ఇవ్వాలని , తనతో పాటు ఇతర సాయుధ దళాల చీఫ్ లు పార్లమెంట్ స్పీకర్ ను కోరినట్లు స్పష్టం చేశారు శవేంద్ర సిల్వా.
Also Read : లంక ఫ్లైట్స్ కు కేరళ లైన్ క్లియర్