SL vs AUS 3rd ODI : ఆసిస్ పరాజయం లంక సీరీస్ కైవసం
ఉత్కంఠ భరిత పోరులో ఘన విజయం
SL vs AUS 3rd ODI : ఎన్నాళ్లకెన్నాళ్లకు శ్రీలంక అద్భుతమైన ప్రదర్శన చాటింది. 1992 తర్వాత అంటే 20 ఏళ్ల అనంతరం శ్రీలంక జట్టు బలమైన, టి20 వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది.
వన్డే సీరీస్ చేజిక్కించుకుంది. సొంత గడ్డపై ఆసిస్ తో ఉత్కంఠ భరితంగా సాగింది మూడో వన్డే మ్యాచ్. సీరీస్ విజేత ఎవరో నిర్దేశించే ఈ మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది శ్రీలంక.
మొదటి వన్డేలో ఆస్ట్రేలియా గెలుపొందితే రెండో, మూడో వన్డేలలో వరుసగా శ్రీలంక(SL vs AUS 3rd ODI) సత్తా చాటింది. నువ్వా నేనా అన్న రీతిలో జరిగిన ఈ మ్యాచ్ చివరి వరకు టెన్షన్ రేపింది.
నాలుగు పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో మైదానంలోకి దిగిన శ్రీలంక 40 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది.
లంక జట్టులో చరిత్ అసలంక దుమ్ము రేపాడు. ఆసిస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 106 బంతులు మాత్రమే ఎదుర్కొని 110 పరుగులు చేశాడు. 10 ఫోర్లు ఒక సిక్స్ కొట్టాడు.
అతడితో పాటు ధనంజయ డిసిల్వ రాణించాడు. 61 బంతులు మాత్రమే ఎదుర్కొని 60 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. అనంతరం 259 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 254 పరుగులకే చాప చుట్టేసింది.
శ్రీలంక బౌలర్లు కట్టడి చేయడంతో విజయం స్వంతమైంది. సీరీస్ దక్కింది. ఆస్ట్రేలియా ఆఖరు వరకు పోరాడింది. ప్రధానంగా స్టార్ హిట్టర్
డేవిడ్ వార్నర్ మరోసారి రెచ్చి పోయాడు.
112 బంతులు ఎదుర్కొని 99 రన్స్ చేశాడు. కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. ఇందులో 12 ఫోర్లు ఉన్నాయి. ఆఖరులో పాట్
కమిన్స్ ఆశలు పెంచాడు.
కానీ ఔట్ కావడంతో ఓటమి తప్పలేదు ఆసిస్ కు. కమిన్స్ 35 రన్స్ చేశాడు. చివరి ఓవర్ ఉత్కంఠ రేపింది. విజయానికి 19 రన్స్ చేయాల్సిన
పరిస్థితి. షనక ఆఖరి ఓవర్ వేశాడు. కునెర్మన్ ను అవుట్ చేయడంతో శ్రీలంక(SL vs AUS 3rd ODI) జయకేతనం ఎగుర వేసింది.
Also Read : బీసీసీఐ మాటే వేదం ఐసీసీ శిరోధార్యం