SS Rajamouli NYFCC : ‘జక్కన్న’కు అరుదైన పురస్కారం
ఆర్ఆర్ఆర్ మూవీకి గౌరవం
SS Rajamouli NYFCC : టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి(SS Rajamouli) మరో పురస్కారం లభించింది. ఆయన రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ భారీ ఆదరణ చూరగొంది. దేశ వ్యాప్తంగా సూపర్ కలెక్షన్లు సాధించింది. ఆపై ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ తరుణంలో ఆ సినిమాకు కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ కు రాజ్యసభ సీటు కూడా దక్కింది. ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు తీరాక భక్తి, చరిత్రకు సంబంధించిన అంశాల ప్రాతిపదికన తీసిన చిత్రాలకు భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే వివేక్ అగ్ని హోత్రి తీసిన కాశ్మీర్ ఫైల్స్ కు వచ్చిన పబ్లిసిటీతో కోట్లు వసూలయ్యాయి. ప్రస్తుతం ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ లో గ్రాఫిక్స్ మాయజాలం తప్ప ఇంకేమీ లేదన్న ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటిని పక్కన పెడితే ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న పేరు గతంలో బాహుబళి, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ ద్వారా వరల్డ్ వైడ్ గా పేరు పొందారు.
ఇప్పటికే ఆయనకు శాటర్న్ , సన్ సెట్ సర్కిల్ వంటి అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళికి హాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా భావించే ది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్(SS Rajamouli NYFCC) అవార్డు లభించింది. అమెరికాలో పురస్కారాల ప్రధానోత్సవంలో ఈ చిత్రానికి సంబంధించి జక్కన్నకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కింది.
కాగా ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ చిత్రం రూ. 1200 కోట్లు వసూలు చేసింది.
Also Read : అమితాబ్ బచ్చన్ లివింగ్ లెజెండ్
. @SSRajamouli wins the prestigious New York Film Critics Circle Award for the Best Director! 🤩⚡️ @NYFCC
Words can't do justice to describe how happy and proud we are…
Our heartfelt thanks to the jury for recognising #RRRMovie. pic.twitter.com/zQmen3sz51
— RRR Movie (@RRRMovie) December 3, 2022