Trujet : నటుడు రామ్ చరణ్ హీరో గానే కాదు వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారు. టాలీవుడ్ లో పలువురు హీరోలు ఇదే రకమైన వ్యాపార ధోరణితో ముందుకు సాగుతున్నారు.
దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టు కోవాలనే ఉద్దేశంతో బిజినెస్ వైపు ఫోకస్ పెట్టారు. వారిలో అందరికంటే ముందంజలో ఉన్నాడు అక్కినేని నాగార్జున. ఇక చెర్రీ విషయానికి వస్తే హీరోగా బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగా కూడా మారారు.
పలు వ్యాపార సంస్థల్లో పార్ట్ నర్ గా ఉన్నాడు. ఆయనకు ఓ విమానయాన సంస్థ కూడా ఉంది. దీనిని 2015 సంవత్సరంలో తన ఫ్రెండ్ తో కలిసి డొమెస్టిక్ ఎయిర్ లైన్ ప్రారంభించాడు. హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు కూడా విమానాలు నడుపుతోంది.
తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం అందించాలనే కాన్సెప్ట్ తో దీనికి ట్రూ జెట్(Trujet) అని పేరు పెట్టారు. ఇప్పటి దాకా విమానాలు నడుస్తూ వచ్చినా ఇటీవలి కాలం నుంచి నష్టాల్లో కూరుకు పోయింది.
దీనిపై త్వరలోనే మూసి వేత ఖాయం అంటూ ప్రచారం జోరందుకుంది. దీనిపై ట్రూ జెట్ కంపెనీ స్పందించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. సంస్థ ఎక్కడికీ పోదు.
ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వస్తారని తెలిపింది. ఇన్వెస్టర్లు వచ్చాక కొత్త సిఇఓను ప్రకటిస్తాం. అందాక ఉమేష్ ఉంటాడని వెల్లడించింది.
తాత్కాలికంగా సర్వీసులు నిలిపి వేశాం. త్వరలోనే పునః ప్రారంభిస్తామని పేర్కొంది. పని చేసే వారికి వేతనాలు ఇస్తూనే ఉన్నామని తెలిపింది.
Also Read : చిత్రా రామకృష్ణను ప్రశ్నిస్తున్న సీబీఐ