Sucheta Dalal Comment : ఆర్థిక నేర‌స్థుల‌కు ఆమెంటే హ‌డల్

ఎవ‌రీ సుచేతా ద‌లాల్ ఏమిటా క‌థ

Sucheta Dalal Comment : ఇవాళ యావ‌త్ ప్ర‌పంచం హిండెన్ బ‌ర్గ్ గురించి వాక‌బు చేస్తోంది. దానిని స్థాపించిన ఆండ‌ర్స‌న్ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారాడు. కానీ భార‌తీయుల‌కు తెలియ‌నిది ఏమిటంటే ల‌క్ష‌ల కోట్ల‌కు అధిప‌తిగా ఉన్న అదానీ గ్రూప్ సంస్థ‌ల అధిప‌తి గౌతమ్ అదానీ ఎలా ఈ స్థాయికి చేరాడు.

దాని వెనుక ఉన్న మ‌త‌లబు ఏమిటి..అనే దానిపై గ‌తంలోనే ద‌మ్మున్న జ‌ర్న‌లిస్టుగా పేరొందిన సుచేతా ద‌లాల్(Sucheta Dalal)  కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ప్ర‌స్తుతం మ‌రోసారి ఆమె వైర‌ల్ గా మారారు. సోష‌ల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు. కొన్ని క‌లాలు (జ‌ర్నలిస్టులు) నిటారుగా నిల‌బ‌డ‌తాయి. నిగ్గ‌దీసి ఈ సిగ్గులేని స‌మాజాన్ని ప్ర‌శ్నిస్తాయి. 

చ‌ట్టాల‌ను అడ్డం పెట్టుకుని, పాల‌కుల‌ను పావులుగా వాడుకుంటూ సూప‌ర్ ప‌వ‌ర్ గా ఎదుగుతూ కొద్ది కాలంలోనే కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తే కార్పొరేట్లు, వ్యాపార‌వేత్త‌లు, బ‌డా బాబులు, ఆర్థిక వేత్త‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించే ద‌మ్మున్న జ‌ర్న‌లిస్టులు కొంద‌రు లేక పోలేదు. అలాంటి వారిలో రావిష్ కుమార్ ఒక‌రైతే మ‌రొక‌రు సుచేతా ద‌లాల్.

ఇవాళ్ల దేశ‌మంత‌టా అదానీ(Adani Group) గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో సుచేతా ద‌లాల్ గురించి కూడా ప్ర‌స్తావిస్తున్నారు. ఎందుకంటే ఆమె గ‌తంలోనే గౌతం అదానీ చేస్తున్న మోసం..మార్కెట్ మాయాజాలాన్ని ఎత్తి చూపారు. ఒక ర‌కంగా చెంప ఛెళ్లుమ‌నిపించేలా చేశారు.

నిఖార్సైన జ‌ర్న‌లిస్టుగా పేరొందిన ద‌లాల్(Sucheta Dalal)  మోసాల‌ను ఎండ‌గ‌ట్టడంలో దిట్ట‌. 1962లో ముంబైలో పుట్టారు. ధార్వాడ‌లోని క‌ర్ణాట‌క కాలేజీలో చ‌దివారు. ముంబై యూనివ‌ర్శిటీలో ప‌ట్టా తీసుకున్నారు. జ‌ర్న‌లిజాన్ని కెరీర్ గా స్వీక‌రించారు.

వ్యాపార‌, వాణిజ్య పాత్రికేయురాలిగా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. 1992లో దేశంలో పెను సంచ‌ల‌నం సృష్టించింది సుచేతా ద‌లాల్ . భార‌త స్టాక్ మార్క‌ట్ లో చోటు చేసుకున్న కుంభ‌కోణాన్ని వెలికి తీసింది. 

దెబ్బ‌కు దేశం యావ‌త్తు ఎవ‌రీ సుచేతా అని చూసేలా చేసింది. ఆనాటి నుంచి నేటి దాకా వ్యాపార రంగంలో చోటు చేసుకున్న లొసుగుల‌ను వెతికి

ప‌ట్టుకునే ప‌నిలో ప‌డింది. ఇందుకు సంబంధించి ప‌రిశోధ‌నాత్మ‌క క‌థ‌నాల‌తో ముందుకు సాగుతోంది సుచేతా ద‌లాల్. 

ఆమె చేసిన కృషికి గుర్తింపు గా 2006లో ప‌ద్మ‌శ్రీ కూడా ద‌క్కింది. ప్ర‌స్తుతం మ‌నీ లైఫ్ న్యూస్ పోర్ట‌ల్ కు ఎగ్జిక్యూటివ్ ఎడిట‌ర్ గా ప‌ని చేస్తోంది. గ‌త 20 ఏళ్ల‌కు పైగా పాత్రికేయ రంగంలో కొన‌సాగుతూ వ‌స్తోంది.

1996 వ‌ర‌కు టైమ్స్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియ‌ల్ ఎడిట‌ర్ గా ఉన్నారు. అంత‌కు ముందు ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ క‌న్స‌ల్టింగ్ ఎడిట‌ర్ గా , కాల‌మిస్ట్ గా ప‌ని చేసింది సుచేతా ద‌లాల్. ఆమె భ‌ర్త దేబాషిస్ ప్రారంభించిన మ‌నీ లైఫ్ కోసం రాయ‌డం ప్రారంభించింది.

మేనేజింగ్ ఎడిట‌ర్ గా చైత‌న్య‌వంతం చేసే ప‌నిలో ప‌డింది. 2010లో భార‌త దేశంలో ఆర్థిక అక్ష‌రాస్య‌త త‌క్కువ‌గా ఉండ‌డాన్ని గుర్తించారు. మ‌నీ లైఫ్ పేరుతో ఫౌండేష‌న్ స్థాపించారు సుచేతా ద‌లాల్(Sucheta Dalal) . ఇన్వెస్ట‌ర్ ఎడ్యుకేష‌న్ , ప్రొటెక్ష‌న్ ఫండ్ లో స‌భ్యురాలిగా కూడా ఉన్నారు. 

చ‌మేలీ దేవి జైన్ పుర‌స్కారం కూడా ద‌క్కింది త‌ను చేసిన కృషికి గాను. 1984లో సుచేత ఫార్చున్ ఇండియా ప‌త్రిక‌లో కెరీర్ స్టార్ట్ చేసిన ద‌లాల్ బిజినెస్ స్టాండ‌ర్డ్ , ది ఎక‌నామిక్ టైమ్స్ వంటి దిగ్గ‌జ సంస్థ‌ల‌లో ప‌ని చేసింది. 

1990 ప్రారంభంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాణిజ్య‌, ఆర్థిక శాస్త్ర విభాగంలో జ‌ర్న‌లిస్టుగా ప్రూవ్ చేసుకుంది. 

హ‌ర్ష‌ద్ మెహ‌తా కుంభ‌కోణం, ఎన్రాన్ స్కాం , ఇండ‌స్ట్రియల్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)స్కాం, 2001 నాటికేత‌న్ ప‌రేఖ్ స్కాంలు కూడా ఉన్నాయి. అదానీ స్కాం గురించి సుచేతా ద‌లాల్ చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపింది. 

అది భార‌తీయ వ్యాపార రంగాన్ని కుదిపేసింది. సెబీ ట్రాకింగ్ సిస్ట‌మ్స్ అందుబాటులో ఉన్న స‌మాచార బ్లాక్ బాక్స్ వెలుప‌ల నిరూపించేందుకు క‌ష్ట‌త‌ర‌మైన మ‌రో స్కాం ఏమిటంటే..ఒక స‌మూహం ధ‌ర‌ల‌ను క‌నిక‌రం లేకుండా రిగ్గింగ్ చేస్తున్న గ‌తానికి చెందిన ఆప‌రేట‌ర్ (అదానీ ) తిరిగి రావ‌డం. అన్నీ విదేశీ సంస్థ‌ల ద్వారానే..అత‌డి ప్ర‌త్యేక‌త అని సీరియ‌స్ కామెంట్స్ చేసింది. 

ఏది ఏమైనా ఇలాంటి జ‌ర్న‌లిస్ట్ ఉన్నందుకు గ‌ర్వ ప‌డాలి. ఒక ర‌కంగా స‌లాం చేయాలి.

Also Read : అదానీ అవ‌క‌త‌వ‌క‌ల‌పై చ‌ర్చించాలి

Leave A Reply

Your Email Id will not be published!