#GavaskarComment : రోహిత్ శర్మ పై సునీల్ గవాస్కర్ కామెంట్
రోహిత్ ఈజీ క్యాచ్ పై క్రికెట్ లవర్ల ఫైర్
Gavaskar : నువ్వా నేనా అన్న రీతిలో గాభాలో జరుగుతున్న నాలుగో టెస్టులో సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరడంపై మాజీ ప్లేయర్, క్రికెట్ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ మండిపడ్డారు. ఇప్పటికే ఇండియా ఇద్దరు ఓపెనర్లు శర్మ, శుబ్‌మన్ గిల్ వికెట్లను కోల్పోయి 62 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 74 బంతులు ఎదుర్కొని 6 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి వెనుదిరిగాడు. కమిన్ష్ వేసిన ఏడోవ ఓవర్ రెండో బంతికి గిల్ అవుట్ కాగా లయన్ వేసిన 20 ఓవర్ ఐదో బాల్ కు రోహిత్ పెవిలియన్ చేరాడు.
అయితే అందరూ చూస్తుండగానే రోహిత్ ఈజీ క్యాచ్ ఇవ్వడంపై క్రికెట్ అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేసింది. లయన్ వేసిన బంతిని మిడాన్ వైపునకు షాట్ ఆడాడు. లాంగాన్ లో ఉన్న స్టార్క్ కాస్తా ముందుకు కదిలి దాన్ని పట్టాడు. ఈ క్రమంలో రోహిత్ షాట్ ఆడడం అస్సలు బాగో లేదంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఒక సీనియర్ అయి ఉండి అనవసరంగా వికెట్ సమర్పించుకున్నాడని కామెంటరీ సందర్భంగా అన్నాడు.
కాగా 5 వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసిస్ 369 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరంగేట్ర బౌలర్లు నటరాజన్, సుందర్ తలో మూడు వికెట్లు దక్కించుకోగా సిరాజ్ ఒక వికెట్ మరో బౌలర్ ఠాకూర్ 3 వికెట్లు తీసుకున్నారు. కాగా చతేశ్వర్ పుజారా 8 పరుగులతో కెప్టెన్ రహానే 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 307 పరుగులతో వెనుకబడి ఉంది. మూడో రోజు ఇండియా మెరుగైన స్కోర్ సాధిస్తుందా లేక ఫాలో ఆన్ ఆడుతుందా అన్నది మన ఆటగాళ్ల బ్యాటింగ్ మీద ఆదార పడి ఉంది.
No comment allowed please