Sunil Narine : ప్రపంచ క్రికెట్ రంగం నుంచి తాను నిష్క్రమిస్తున్నట్లు సంచలన ప్రకటించారు వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్(Sunil Narine) . ఆయనకు 35 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ప్రత్యర్థులకు తన అద్భుతమైన ఆట తీరుతో చుక్కలు చూపిస్తూ వచ్చిన ఈ ఆల్ రౌండర్ ఉన్నట్టుండి తప్పు కోవడం వెనుక ఏమై ఉంటుందనే చర్చ కొనసాగుతూనే ఉంది. అయితే క్రికెట్ ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పాడు ఇదే సమయంలో. తాను టీ20 లీగ్స్ లలో మాత్రం పార్టిసిపేట్ చేస్తానంటూ పేర్కొన్నాడు సునీల్ సెరైల్.
Sunil Narine Exit Viral
ఈ సందర్బంగా భావోద్వేగానికి లోనయ్యాడు. ఇవాల్టితో నాకు విండీస్ క్రికెట్ తో బంధం తెగి పోతుందని అనుకోవడం లేదన్నారు. ఇన్నేళ్లుగా తనను ఆదరించినందుకు, మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు, కోచింగ్ సిబ్బందికి , ఫ్యాన్స్ కు థ్యాంక్స్ తెలిపాడు సునీల్ నరైన్. వరల్డ్ వైడ్ గా బౌలర్ గా , బ్యాటర్ గా పేరు పొందాడు. 6 టెస్టులు 65 వన్డేలు, 51 టి20లు ఆడాడు. ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ ఫెవరబుల్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Also Read : Eatala Rajender : కేసీఆర్ పరాజయం ఖాయం – ఈటెల