న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీతా విలియమ్స్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రముఖ న్యోవోగామ సంస్థ నాసాలో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వహించారు. ప్రపంచ వ్యోమగామ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నారు. ఒక మహిళగా ఏకంగా 608 రోజుల పాటు అంతరిక్షంలో నడిచిన వ్యక్తిగా, గడిపిన మహిళగా చరిత్ర సృష్టించారు. తను 27 ఏళ్లపాటు నాసాలో విధులు నిర్వహించింది. ఇన్నేళ్లుగా విశిష్ట సేవలు అందించిన సునీతా విలియమ్స్ ఉన్నట్టుండి తన పదవీ కాలం పూర్తి కావడంతో గత ఏడాది 2025 డిసెంబర్ నెలలో పదవీ విరమణ పొందారు. ఈ సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమానికి సునీత విలియమ్స్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సౌర వ్యవస్థలో మనం చాలా చిన్న స్థానంలో ఉన్నామని అన్నారు. అంతరిక్షం నుండి తాను ఎప్పుడూ తండ్రి జన్మస్థలమైన భారత్‌ను, తల్లి స్వదేశమైన స్లోవేనియాను వెతుకుతానని పేర్కొన్నారు. తాను సురక్షితంగా భూమికి తిరిగి రావాలని ప్రార్థించిన ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలపడానికే ఇక్కడికి వచ్చానని స్పష్టం చేశారు సునీతా విలియమ్స్. తన జీవితంలో నాసా లో గడపడం మరిచి పోలేనని చెప్పారు. ఎన్నో అనుభవాలను మూటగట్టుకున్నానని అన్నారు . తను పలు ప్రాజెక్టులలో కీలకంగా వ్యవహరించడం కూడా మరిచి పోలేనని అన్నారు.ప్రతి ఒక్కరి జీవితంలో పదవీ విరమణ అనేది సహజమని, కానీ ఇన్నేళ్ల పాటు నాసాతో ఉన్న బంధాన్ని మరిచి పోలేనన్నారు.
