Supreme Court of India: సుప్రీంకోర్టులో నీతీశ్‌కు ఎదురుదెబ్బ !
సుప్రీంకోర్టులో నీతీశ్‌కు ఎదురుదెబ్బ !
Supreme Court of India: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోటా పెంపును గతంలో పాట్నా హైకోర్టు రద్దు చేసింది. కాగా ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బిహార్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. తాజాగా ఈ ఉత్తర్వులపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
Supreme Court of India…
నీతీశ్ సర్కారు గతేడాది నవంబరులో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల కోటాను 50 నుంచి 65 శాతానికి పెంచుతున్నట్టు అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టింది. దాంతో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనకబడిన వర్గాలు, అణగారిన వర్గాల రిజర్వేషన్లు 65 శాతానికి పెరిగాయి. ఈ పెంపుపై కొన్నివర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం జూన్ 20న 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. తాజాగా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ బిహార్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
Also Read : Arvind Kejriwal: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై సీబీఐ చార్జిషీట్ !