Supreme Court of India: కోల్‌ కతా వైద్యురాలి హత్యాచార కేసు సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు !

కోల్‌ కతా వైద్యురాలి హత్యాచార కేసు సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు !

Supreme Court of India: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీకార్‌ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్‌ హత్యోదంతంలో కీలక పరిణామ చోటు చేసుకుంది. ఈ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది. మంగళవారం ఉదయం 10:30 గంటలకు టాప్ ప్రయారిటీ కింద ఈ అంశం విచారణకు రానుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించనుంది. సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు వెలువడొచ్చనేది తీవ్ర ఉత్కంఠతను రేపిస్తున్నాయి.

Supreme Court of India…

కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన కేసును సుమోటోగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు న్యాయవాదులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ క్రమంలోనే కేసు విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ కేసును కలకత్తా హైకోర్టు ఇప్పటికే సీబీఐకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. విచారణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడికి మానసిక సామర్థ్య పరీక్షలు నిర్వహించనుంది.

Also Read : Congress : రైళ్లలో ఆహార లోపాలపై విమర్శలు చేసిన కాంగ్రెస్ కు క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ

Leave A Reply

Your Email Id will not be published!