CM YS Jagan: జగన్‌ అక్రమాస్తుల కేసులొ సీబీఐకి సుప్రీం సూటి ప్రశ్న !

జగన్‌ అక్రమాస్తుల కేసులొ సీబీఐకి సుప్రీం సూటి ప్రశ్న !

CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి గల కారణాలు చెబుతూ నాలుగు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని… విచారణ వేగంగా పూర్తిచేయాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ఆదేశించింది.

CM YS Jagan Cases Update

డిశ్చార్జ్‌ పిటిషన్ల కారణంగా జాప్యమవుతోందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్‌ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాజకీయ నేత, సీఎం అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా అన్నారు. బెయిల్‌ రద్దు, కేసు విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.

Also Read : Kavitha Bail : కవిత బెయిల్ పిటిషన్ పై మరో కీలక అప్డేట్

Leave A Reply

Your Email Id will not be published!