Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం కోర్టు షాక్ !
బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం కోర్టు షాక్ !
Bilkis Bano Case: గుజరాత్ లోని గోద్రాలో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి ఆమె కుటుంబాన్ని చంపిన కేసులో దోషులకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. దోషులు రాధేశ్యామ్ భగవాన్‌దాస్, రాజుభాయ్ బాబులాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
Bilkis Bano Case Update
2022లో గుజరాత్ ప్రభుత్వం దోషుల బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇరువురు సుప్రీం కోర్టు మెట్లెక్కారు. ఈ కేసును విచారించడానికి నిరాకరించిన ధర్మాసనం వారి పిటిషన్ ని కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను గతేడాది గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేసింది. వారికి రెమిషన్ మంజూరు చేసిన గుజరాత్ సర్కార్… వారిని జైలు నుంచి బయటకు విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు బిల్కిస్ బానో… ఈ కేసులో దోషులుగా తేలి జీవితఖైదు అనుభవిస్తున్న వారిని జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
పూర్వాపరాలు పరిశీలించిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బాధితురాలు బిల్కిస్ బానో(Bilkis Bano Case) సవాల్ చేయడం సరైనదేనని స్పష్టం చేసింది. 11 మంది దోషులను విడుదల చేయాలనే నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో దోషులైన 11 మంది ఖైదీలకు రెమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.
అయితే 2002 లో జరిగిన గోద్రా దహనకాండతో గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి. ఆ సమయంలో బిల్కిస్ బానో(Bilkis Bano Case) 5 నెలల గర్భిణిగా ఉంది. ఆ సమయంలో కొందరు దుండగులు.. గర్భిణీ అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె కుటుంబానికి చెందిన 7 మందిని హతమార్చారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21వ తేదీన జీవిత ఖైదు విధించింది.
15 ఏళ్ల జైలు శిక్ష అనంతరం తమను విడుదల చేయాలని కోరుతూ ఓ దోషి 2022లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు కోరింది. కోర్టు సూచనతో గుజరాత్ ప్రభుత్వం ఓ కమిటీ నియమించి కమిటీ సిఫారసుల ఆధారంగా 11 మందికి రెమిషన్ విధించడంతో 2022 ఆగస్టు 15న దోషులంతా విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశమంతటా వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. ఈ నిర్ణయాన్ని బిల్కిన్ బానో(Bilkis Bano Case) సుప్రీం కోర్టులో కోర్టు గుజరాత్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రభుత్వానిది మతి లేని నిర్ణయమని మండిపడింది. దోషులతో కుమ్మక్కైన గుజరాత్ ప్రభుత్వం తీవ్రమైన అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలిపింది. ఓ మహిళపై ఇంత క్రూరంగా నేరానికి పాల్పడితే శిక్ష ఎందుకు తగ్గిస్తారంటూ నిలదీసింది. ఈ తరహా నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాధితురాలి మతం, విశ్వాసాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోకూడదని తెలిపింది. సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో అలా దోషుల్ని మళ్లీ అరెస్ట్ చేశారు. తాజాగా మధ్యంతర బెయిల్ కోసం మళ్లీ పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు ఎదుట దోషులకు చుక్కెదురైంది.
Also Read : Minister Veeranjaneya : వినుకొండ హత్య టీడీపీదే అనడం సబబు కాదు